YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ సినిమాపైనే పగ...

పవన్ సినిమాపైనే పగ...

ఏలూరు, ఏప్రిల్ 29,
సినిమా విడుదలవుతోంది అంటే టికెట్ల ధరల విషయంలో కొద్ది రోజుల వరకు చర్చ జరిగింది. సినిమా టికెట్ల ధరల్లో వచ్చిన మార్పులు మరోసారి వివాదంగా మారింది. సినిమా టికెట్ల ధరల విషయంలో ఒక్కో హీరోకు ఒక్కోలా అనుమ‌తించ‌డం జ‌గ‌న్ సర్కార్ పై దూమరం రేపుతోంది. సినిమా టికెట్‌ ధరలను నిర్ధారిస్తూ జారీ చేసిన జీవో నెం 13 ప్రకారం సినిమా రేట్లు మొదటి 10 రోజులకు పెంచుకోవచ్చని మార్చి 7న ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.  మెగాస్టార్‌ చిరంజీవి రామ్‌చరణ్‌ కలిసి నటించిన ఆచార్య సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. విడుదలైన రోజు నుంచి పది రోజులపాటు టికెట్‌ రేట్లు పెంచుకునే అనుమతి ఇచ్చింది. సినిమా బడ్జెట్‌ ఎక్కువ కావడంతో ఆచార్య టీమ్‌ రిక్వెస్ట్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే జీవోను ముందే తీసుకురావాల్సి ఉండగా తీసుకురాలేదు. దీన్నిబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయ‌క్‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ అడ్డంగా బుక్ చేశాడ‌ని అర్థం అవుతోంది.ఈ సినిమాకు తరువాత వచ్చిన రాధేశ్యామ్, ట్రిపుల్ ఆర్‌ ,ఆచార్య సినిమాలకు టికెట్ రెట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. రాజ‌కీయ ప‌గ‌ను సినిమాల విడుద‌ల రూపంలో తీర్చుకోవడం ఏమిటంటూ నిలదీస్తున్నారు. ట్రిపుల్ ఆర్‌ సినిమాకు రూ.500 వరకు టికెట్ ధరను అమ్ముకున్న పభుత్వం పట్టించుకోలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. బీమ్లా నాయ‌క్ సినిమాకు మాత్రం సినిమా హాల్ ఎదుట పోలీసులు బందోబస్తు ఉంచి బ్లాక్ టికెట్లను అరికట్టినప్పుడు ట్రిపుల్ ఆర్‌‌కు ఎందుకు అలా చేయలేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts