YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టులో సవాల్ అర్ధరాత్రి హైడ్రామా.. యడ్యూరప్పను ఆహ్వానించిన గవర్నర్

గవర్నర్ నిర్ణయాన్ని సవాల్  చేస్తూ రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టులో సవాల్      అర్ధరాత్రి హైడ్రామా.. యడ్యూరప్పను  ఆహ్వానించిన గవర్నర్

 కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ వాజుభాయి వాలా తీసుకున్న నిర్ణయాన్ని సవాల్  చేస్తూ ప్రముఖ న్యాయనిపుణుడు రాంజెఠ్మలానీ గురువారం  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత హోదాలో ఆయన సవాల్ చేశారు. గవర్నర్ ఆహ్వానం మేరకు బీఎస్ యడ్యూరప్ప ఈ రోజు కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.బలనిరూపణకు ఆయనకు గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. అయితే, గవర్నర్ నిర్ణయంపై నిన్న రాత్రే కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపు తట్టగా, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో తమ తుది ఆదేశాలకు లోబడి ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం ఉంటాయని మాత్రం స్పష్టం చేసింది.కాగాకర్ణాటక పరిణామాలపై సుప్రీంకోర్టు కేంద్రంగా బుధవారం అర్ధరాత్రి దాటాక హైడ్రామా చోటుచేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నరు ఆహ్వానించడంపై కాంగ్రెస్‌ సుప్రీం కోర్టుకెక్కింది. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కాంగ్రెస్‌ సీనియరు నేత, న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కోర్టును కోరారు. దీంతో ముగ్గురు న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్ర అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ధర్మాసనంలో జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఉన్నారు. తెల్లవారుజామున 2 గంటలకు కోర్టు విచారణ ప్రారంభించింది. 3.20 వరకూ వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అభ్యంతరాలపై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలను సంధించింది. కాంగ్రెస్‌ తరఫున సింఘ్వీ, ప్రభుత్వం తరఫున ఏజీ కేకే వేణుగోపాల్‌, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరయ్యారు. భాజపా, యడ్యూరప్ప తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. కోర్టులో న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. మెజారిటీ ఉన్నవారినే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని వాదనలు వినిపించారు. బలనిరూపణకు 15 రోజుల సమయం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశమిచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యవహారంలో గతంలో కోర్టు 48 గంటల సమయమే ఇచ్చిందని చెప్పారు. గోవాలో అతిపెద్ద కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడాన్ని ఆయన గుర్తుచేశారు. గవర్నరుకు ఇంజెక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వజాలమని ఆయన పేర్కొన్నారు.  

మెజారిటీ నిరూపించుకోవడానికి అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడం సంప్రదాయం కాదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఒక పార్టీని గవర్నరు పిలవకుండా కోర్టు అడ్డుకోగలదా? అని కూడా అడిగింది. అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయదా? అని ప్రశ్నించింది. గతంలో గవర్నరు చర్యను అడ్డుకున్న సందర్భముందని సింఘ్వీ సమాధానమిచ్చారు. ప్రస్తుతం కర్ణాటకలో ఇన్‌ఛార్జి ఎవరని ధర్మాసనం అడగ్గా కేర్‌టేకర్‌ ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు. గోవా, మణిపూర్‌, మేఘాలయ, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో కూటములను మొదట ఆహ్వానించారని గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన తీర్పులు గవర్నరుకు వ్యతిరేకంగా, ఆయనను అడ్డుకోవడానికి ఇచ్చినవి కావని కోర్టు అభిప్రాయపడింది. గవర్నర్‌ అధికారాలను తాము అడ్డుకోలేమని స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్‌, జేడీఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేయలేదు. 

Related Posts