YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రసూతి సేవలకు పిపి యూనిట్ వైద్యులు

ప్రసూతి సేవలకు పిపి యూనిట్ వైద్యులు

మదనపల్లె
అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భవతులకు, బాలింతలకు వైద్య సేవలు అందించే సమయంలో ఇబ్బంది కలగకుండా పిపి యూనిట్ డాక్టర్లను అనుసంధానం చేయడం జరిగిందని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం  మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ నందు పిపి యూనిట్ డాక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎమ్వో దివాకర్, పిపి యూనిట్ మెడికల్ ఆఫీసర్లు అనుపమ, గంగాదేవి, కార్యాలయ సూపరింటెండెంట్ ఫణిభూషణ్ ఉన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భవతులకు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. వారికి అసౌకర్యం కలగకుండా పిపి యూనిట్ డాక్టర్ల సేవలను వినియోగించు కోవడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

Related Posts