YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంగళగిరిలో గిరి గీసీ మరీ....లోకేష్

మంగళగిరిలో గిరి గీసీ మరీ....లోకేష్

గుంటూరు, ఏప్రిల్ 30,
పోగొట్టుకున్న చోటే వెతకాలి’ ఇది పెద్దలు చెప్పిన మాట. కానీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వెతకడమే కాదు ఏకంగా వేట మొదలెట్టేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంపై ఆయన పూర్తి పట్టు సాధించడం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. ప్రతినిత్యమూ ప్రజల మధ్యనే ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తున్నారు. జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ హయాంలో ఏపీ వ్యాప్తంగా ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఎదురైనా వేగంగా స్పందిస్తున్నారు. బాధిత ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారు. అందుకే, లోకేశ్ దూకుడు వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. చినబాబు తుమ్మపూడిలో అడుగుపెడితే.. ఆర్కే అనుచ‌రులు రాళ్ల దాడికి ప్ర‌య‌త్నించారు. ఎస్ఐ త‌ల‌ప‌గ‌ల‌గొట్టారు. ఇలా రౌడీల్లా రెచ్చిపోతే.. కుక్క‌ల్లా మొరిగితే.. లోకేశ్ భ‌య‌ప‌డిపోతార‌ని అనుకున్న‌ట్టున్నారు. కానీ, అక్క‌డ ఉన్న‌ది నారా లోకేశ్‌. రాళ్ల దాడి జ‌రిగినా.. అద‌ర‌లేదు.. బెద‌ర‌లేదు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి.. రాళ్ల దాడిపై అదే రేంజ్‌లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. న్యాయం జ‌ర‌గ‌క‌పోతే 15 రోజుల్లో మ‌ళ్లీ వ‌స్తానంటూ స‌వాల్ చేశారు. ద‌టీజ్ లోకేశ్‌. లోకేష్ తన స్లైల్ మార్చారు. ప్రసంగాల్లో వాడీ వేడీ పెంచారు. అధికార పార్టీపైన నిశితంగా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మరింత అవగాహనతో మాట్లాడుతున్నారు. ‘సమయం లేదు మిత్రమా… ఇంకా రెండేళ్లే ఉంది.. ప్రజల్లోకి వెళ్లాలి’ అంటూ వచ్చే ఎన్నికలకు టీడీపీ శ్రేణులను సమాయత్త పరుస్తున్నారు. చినబాబు లోకేష్ స్పీడును చూసి టీడీపీ శ్రేణులే అవాక్కవుతున్నాయి. మా చినబాబు కెవ్వు కేక అంటూ సంబరపడిపోతున్నారుచినబాబు లోకేష్ చాలా రోజులుగా నిత్యం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గం ప్రజల కష్టనష్టాల గురించి తెలుసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తీక్షణమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలపై తాము పోరాటం చేస్తుంటే.. ఎమ్మెల్యేగిరీ చేతిలో పెట్టుకుని ఆళ్ల కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. నియోజకవర్గం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆళ్ల విఫలమైన వైనాన్ని జనానికి అర్థమయ్యేలా చెబుతున్నారు. చంద్రబాబు లాంటి విజనరీ కావాలా? జగన్ లాంటి ప్రిజనరీ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని అంటున్నారు. జనరంజకంగా పాలన సాగించిన రాముడు లాంటి చంద్రబాబు కావాలా? నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోతున్న రాక్షసుడు లాంటి జగన్ కావాలా? నిర్ణయించుకోండంటున్న లోకేష్ మాటలు జనంలోకి బాగా వెళుతున్నాయిప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తున్న లోకేష్ జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై వైసీపీ సర్కార్ ను దుమ్మెత్తిపోశారు. రాజకీయ లబ్ధి కోసం తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేసిన జగన్ కు నవ్వుతూ అబద్ధాలాడడం అలవాటంటూ తూర్పారపడుతున్నారు. సొంత బ్రాండ్లతో జనం జేబులు, ఆరోగ్యాలను గుల్ల చేస్తున్న వైసీపీ సర్కార్ తీరును ఎద్దేవా చేస్తూ జగన్ రెడ్డి చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేయడం అందర్నీ ఆకర్షించింది. జేబ్రాండ్ మద్యం మరణాలపై న్యాయ విచారణకు లోకేష్ డిమాండ్ చేశారు.పెగాసస్ సాఫ్ట్ వేర్ ను టీడీపీ హయాంలో కొనుగోలు చేసి ఉంటే నిరభ్యంతరంగా తమపై చర్యలు తీసుకోవచ్చని జగన్ సర్కార్ ను ఛాలెంజ్ చేస్తున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని టీడీపీ విధానం అని చెబుతూనే.. అభివృద్ధి వికేంద్రీకణ జరగాలని, పరిపాలన కేంద్రీకృతంగా ఉండాలని చెబుతున్నారు. ఏపీ రాజధానిని మూడు ముక్కలాటగా మార్చేసిన జగన్ సర్కార్ తీరుపై లోకేష్ చెప్పిన ఈ మాటలు ఆయన పరిపక్వతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మూడేళ్లలో ఒక్క పరిశ్రమను తీసుకురాలేని వైసీపీ.. ఇప్పుడు జిల్లాల విభజన చేస్తే అభివృద్ధి జరుగుతుందా? అని ఘాటుగా ప్రశ్నించారు. విశాఖను రాబందుల్లా వైసీపీ నేతలు పీక్కు తింటున్నారని దుమ్మెత్తిపోశారు. వైసీపీ కబ్జా కోరల నుంచి విశాఖను రక్షించుకుందామని లోకేష్ పిలుపునివ్వడమే కాకుండా.. బాధితులకు అండగా తాము ఉంటమని భరోసా ఇస్తున్నారు.ఏపీలో విద్యుత్ సమస్యపై స్పందిస్తూ.. 2019 ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న పనులను ఉదహరిస్తూ ‘జనం చెవిలో జగన్ పూలు’ ఏప్రిల్ 1న విడుదల అంటూ సెటైరికల్ వీడియో విడుదల చేశారు. చీటికి మాటికి ఢిల్లీ వెళ్తున్న జగన్ టూర్ దేని కోసం అంటూ.. పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకు అంటూ లోకేష్ ట్విట్టర్ లో పెట్టిన పోల్ బాగా వైరల్ అయింది. ‘అసూయకు మందు లేదు.. అసూయతో ఉంటే త్వరగా గుండెపోటు, బీపీలు వస్తాయి’ అన్న జగన్ కు లోకేష్ ట్విట్టర్ వేదికగా ‘అసూయకు అన్నలాంటి వాడు సీఎం జగన్’ అంటూ గట్టి కౌంటరే ఇవ్వడం గమనార్హం.‘వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు అంతే స్పీడుగా కౌంటర్ వేయడం లోకేష్ లోని స్పీడుకు నిదర్శనం అంటున్నారు. ‘గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమానిలోడని తేలిపోయిన తర్వాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా?.. మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు.. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెంకించాలనే ఆలోచనతో మేం పనిచేస్తున్నాం.. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి, పిండిబొట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు’ అని కౌంటర్ వేశారు. ఒక వైపున ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూనే మరో పక్కన జగన్ కు వివిధ అంశాలపై లోకేష్ లేఖలు రాస్తున్నారు. ఏపీలో ఇటీవల విధించిన పవర్ హాలిడే ఎత్తేయాలంటూ జగన్ కి లేఖ రాశారు. విద్యుత్ రంగాన్ని నాశనం చేసి, ఏపీని అంధకారంలో నెట్టేయడం సరికాదని తప్పుపట్టారు. ఏపీలోని ధాన్యం రైతుల దైన్యంపైన కూడా జగన్ కు లోకేష్ లేఖ రాశారు. రైతుల నుంచి మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.అమ్మ ఒడి’ లబ్ధిదారులకు నిబంధనలు పెట్టిన తీరుపై లోకేష్ సెటైర్లు వేశారు. ‘కన్న తల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లు ఉంది జగన్ అమ్మ ఒడి పథకం తీరు’ అని సెటైర్ వేశారు. ‘అమ్మ ఒడిని అర్ధ ఒడి’ చేశారని దుయ్యబట్టారు. ఏపీలో జగన్ రెడ్డి ఏలుబడిలో బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై లోకేష్ స్పందించారు. ఆస్పత్రుల ప్రైవేట్ అంబులెన్స్ ల దందాపై స్పందిస్తూ.. చేతగాని పాలకుడు జగన్ చెత్త పాలన కారణంగానే రుయా ఆస్పత్రి నుంచి తన కొడుకు మృతదేహాన్ని ఓ తండ్రి బైక్ పై తీసుకెళ్లిన దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ చేపట్టిన ‘బాదుడే బాదుడు’ నిరసనలో భాగంగా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ప్రజలకు విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టి పంపిణీ చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఇళ్లపట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలు ఇవ్వకపోగా ప్రజలపై కక్షకట్టి ఇళ్లు కూల్చేస్తున్నారని ధ్వజమెత్తారు. ట్వాట్టర్ వేదికగా వైసీపీ సర్కార్ ను అనుక్షణం నిలదీస్తూనే, మరో పక్కన ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి, సీఎం జగన్ కు లేఖలు రాస్తున్నారు. మొత్తం మీద పార్టీని గెలుపు బాటలో నడిపించేందుకు చేయాల్సిన కృషి చేస్తూనే.. మంగళగిరిపై మరింత పట్టు పెంచుకునేందుకు కూడా లోకేస్ మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. రాళ్ల దాడులు జ‌రిగినా.. త‌గ్గేదేలే.. వైసీపీ అరాచ‌కాల‌కు బెదిరేదేలే.. జ‌గ‌న్ అండ్ కో ను వ‌దిలేదేలే అంటున్నారు.

Related Posts