YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జీపీఎస్ తో సేఫ్ ల్యాండింగ్

జీపీఎస్ తో సేఫ్ ల్యాండింగ్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30,
ప్రపంచంలో ఇప్పటి వరకూ మూడు దేశాలు మాత్రమే జీపీఎస్ ఆధారంగా విమానాల ల్యాండింగ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వాటి సరసన భారత్‌కు చేరింది. ఇప్పటి వరకైతే జీపీఎస్ సాయంతో వాహనాలను నడుపుతున్నాం. ఇక, నుంచి విమానాలను కూడా ల్యాండ్ చేయనున్నారు. ఇందుకు ఇస్రో మూడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా రాజస్థాన్‌లోని విమానాశ్రయంలో పరీక్షించారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో త్వరలో అన్ని విమానాలకు దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.దశాబ్దాలుగా వాహనదారులకు నావిగేట్ చేయడంలో ఉపగ్రహాలు సహాయపడుతున్నాయి. తాజాగా, జీపీఎస్ సాయంతో విమానం ల్యాండింగ్‌ ట్రయల్ రన్‌ను భారత్ విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో జీపీఎస్ సాయంతో రన్‌వేపై విమానం ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. శుక్రవారం అజ్మేర్ విమానాశ్రయం రన్‌వేపై నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమయ్యింది. రన్‌వేపై విమానాన్ని పైలట్లు సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉప్రగహా ఆధారిత ల్యాండింగ్‌‌ను సురక్షితంగా పూర్తిచేసిన మొదటి దేశం భారత్ అని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఓ ప్రకటనలో తెలిపింది.ఈ ట్రయల్స్ భారత పౌరవిమానయాన చరిత్రలో ఎయిర్ నావిగేషన్ సర్వీసుల్లో ఓ మైలురాయి అని పేర్కొంది. ప్రస్తుతం విమానాల ల్యాండింగ్‌కు సేవలు గ్రౌండ్-బేస్డ్ సిస్టమ్స్ ద్వారా అందుతున్నాయి. ఢిల్లీ నుంచి అజ్మేర్‌ కిషన్‌గఢ్ విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో ఏటీఆర్ విమానానికి కెప్టెన్ సందీప్ సుద్, కెప్టెన్ సతీష్ వీర‌‌లు పైలట్‌లుగా వ్యవహరించారు. కెప్టెన్ శ్వేతా సింగ్, డిప్యూటీ చీఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్, డీజీసీఏకు చెందిన ఇతర అధికారులు విమానంలో వెళ్లారు.శాటిలైట్ అధారిత నావిగేషన్ వ్యవస్థ ‘గగన్’ విమానం ల్యాండింగ్‌ కోసం పైలట్లకు దాదాపు 550 మీటర్ల వరకు రన్‌వే కనిపించేలా సంకేతాలను అందించే గ్రౌండ్-బేస్డ్ ల్యాండింగ్ సిస్టమ్ మాదిరిగా మరింత ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. అయితే, పిలిచే గ్రౌండ్ బేస్డ్ ల్యాండింగ్ 200 అడుగుల నిర్ణీత ఎత్తు వరకు ఉంటుంది. పైలట్‌లు రన్‌వేను గుర్తించకపోతే ల్యాండింగ్ నిలిపివేయాల్సిన ఎత్తు ఇది. ప్రస్తుత ట్రయల్ ఫ్లైట్ కోసం ఎత్తును 250 అడుగులుగా నిర్ణయించారు. ఇందుకోసం గగన్ ద్వారా ‘లోకలైజర్ పెర్ఫార్మెన్స్ విత్ వర్టికల్ గైడెన్స్  విధానాన్ని పైలట్లు ఉపయోగించారు.గగన్ ఎల్వీపీ ఫ్లైట్ ట్రయల్స్‌లో భాగంగా కిషన్‌గఢ్ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా జీపీఎస్ ల్యాండింగ్ నిర్వహించాం.. డీజీసీఏ తుది ఆమోదం పొందిన తర్వాత ఈ విధానం వాణిజ్య విమానాల వినియోగానికి అందుబాటులో రానుంది’’ ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది. ఖరీదైన గ్రౌండ్-బేస్డ్ ల్యాండింగ్ వ్యవస్థలు అందుబాటులో లేని చిన్న ప్రాంతీయ విమానాశ్రయాలలో ఎల్వీపీ ద్వారా ల్యాండింగ్ సాధ్యమవుతుందని ఏఏఐ తెలిపింది. జూలై 1, 2021 తర్వాత దేశంలో రిజిస్టర్ అయిన అన్ని విమానాలకు  వ్యవస్థను అమర్చాలని  ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం, ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా, గో ఫస్ట్,ఎయిర్ ఏషియా వంటి సంస్థలకు చెందిన 76 విమానాల్లో గగన్ వ్యవస్థను అమర్చారు.గగన్ కాకుండా ప్రపంచంలో అమెరికా,యూరప్,జపాన్  వద్ద మాత్రమే ఇటువంటి అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. గగన్ వల్ల ఇంధనం ఆదాతో పాటు గ్రౌండ్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అవసరం ఉండదని, విమాన భద్రత, ముఖ్యంగా ప్రతికూల వాతావరణంలోనూ సురక్షితంగా ల్యాండింగ్‌కు అవకాశం ఉంటుంది అని ఇస్రో పేర్కొంది. గత దశాబ్ద కాలంలో మూడు గగన్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది.

Related Posts