YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆర్ ఎస్ ఎస్ చేతిలో స్వతంత్ర సంస్థలు

ఆర్ ఎస్ ఎస్ చేతిలో స్వతంత్ర సంస్థలు

కర్ణాటకలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై అధ్యక్షుడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన జన స్వరాజ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో నియతృత్వ పాలన సాగుతోందని, పరిస్థితులు పాకిస్థాన్‌లో మాదిరిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. స్వతంత్ర సంస్థలను ఒక్కొక్కటిగా ఆర్ఎస్ఎస్ స్వాధీనం చేసుకుంటోందని, ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రాహుల్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం బీజేపీ భయపెడుతోంది.. ఇలాంటి ఘటనలు నియంతృత్వంలోనే జరుగుతాయి... భయం, అభద్రతతో కూడిన వాతావరణం దేశంలో ప్రబలంగా ఉంది. దేశంలో అన్ని వ్యవస్థలను ఆర్ఎస్ఎస్ ఆ విధంగా మార్చేస్తోంది’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగంపైనే దాడి జరుగుతోందని, దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో భయంకర పరిస్థితులను సృష్టిస్తోన్న బీజేపీ, దళితులు, వెనుకబడిన వర్గాలు, మహిళల కలలు సాకారం కాకుండా అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. తగినంత సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ, అసెంబ్లీలో ఏ విధంగా బలం నిరూపించుకుని, అధికారాన్ని కాపాడుకుంటుందని మండిపడ్డారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలంతా ఒకవైపున ఉంటే, గవర్నర్ మరోవైపున ఉన్నారని  పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందన్న జేడీఎస్ ఆరోపణలను రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పనిలో పనిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. ఏ జాతీయ పార్టీకి హత్యకేసులో నిందితుడు అధ్యక్షుడిగా వ్యవహరించడంతో 70 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారని ఎద్దేవా చేశారు. గత జనవరిలో నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై కూడా రాహుల్ స్పందించారు. న్యాయవ్యవస్థతోపాటు మీడియాలో కూడా భయం నెలకొంది... బీజేపీ ఎంపీలు కూడా భయంతో వణికిపోతున్నారు.. ప్రధాని ముందు ఒక్కమాట కూడా మాట్లాడలేదని పరిస్థితి వారిదని రాహుల్ విమర్శించారు. 

Related Posts