తిరుపతి
తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాకరాపేట ఘాట్ రోడ్డు తరచూ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. తిరుపతి నుండి మదనపల్లి, అనంత పురం వెళ్లేందుకు ఇదే ప్రధాన జాతీయ రహదారి,ఈ ఘాట్ రోడ్డు లో ముఖ్యంగా రెండు అత్యంత ప్రమాదక రమైన మలుపులున్నాయి. ఈ రెండు మలుపుల వద్ద తరచు ప్రమాదాలకు గురికావడం గత నెలలో 60 మంది తో ధర్మవరం నుండి తిరుపతికి వస్తున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో అందులో పది మంది ప్రయాణికులు మరణించడం జరిగింది. మరికొంతమంది కాళ్లు చేతులు పోగొట్టుకుని శాశ్వత వికలాంగులుగా మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డ వారిగా మారడం జరిగింది.ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఈ ఘాట్ రోడ్డును వెడల్పు చేయడం, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రోడ్డు పక్కన గోడ లాంటిది నిర్మించడంలాంటివి ఏమీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం గానీ ప్రభుత్వ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు.ఇకనైనా స్పందించి ఈ రహదారిని బాగు చేసి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుతానని వాహనచోదకులు స్థానిక ప్రజలు కోరుతున్నారు.