ఏలూరు
ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో దారుణ హత్య జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు గంజి ప్రసాద్ ను శనివారం ఉదయం దుండగులు హత్య చేసారు. ఉదయం 7 గంటల సమయంలో హత్య జరిగినట్లు సమాచారం. ప్రసాద్ హత్య విషయం తెలియగానే జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా వుంటున్న గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై జి కొత్తపల్లి వాస్తవ్యులు దాడికి దిగారు. ఒక్కసారిగా గ్రామస్థులు తిరగబడడంతో పోలీసులు ఏమి చేయలేని పరిస్థితిలో పడిపోయారు. ఒక దశలో పోలీసులపై కుడా దాడి జరిగింది. ఘటనలో ఎమ్మెల్యే కు గాయలు అయ్యారు. ఒక గ్రామస్థుడికి చెయ్యి విరిగింది.