YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా సాహితీ స్రవంతి నివాళులు

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా సాహితీ స్రవంతి నివాళులు

విశాఖపట్నం
మహాకవి శ్రీశ్రీ 112 వ జయంతి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్న శ్రీ శ్రీ విగ్రహానికి సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజ శర్మ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎందరో కవులు ఎంతో అమూల్యమైన సాహిత్యాన్ని మానవాళికి అందించినప్పటికీ వారందరిలో శ్రీ శ్రీ ది ప్రత్యేకమైన స్థానమని సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళ భాషలో బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలియజేస్తూ వాటిని అధిగమించి నూతన సమాజ నిర్మాణానికి కృషి చేయవలసిన ఆవశ్యకతను, మార్గాన్ని నిర్దేశించారని తెలియజేశారు. కష్టజీవికి అటు ఇటు నిలిచే వాడే కవి అని తను చెప్పాలనుకున్న విషయాన్ని ఒక్క వాక్కులు తెలియజేయగలగిన మహా మేధావి శ్రీశ్రీ అని పేర్కొన్నారు. శ్రీ శ్రీ రచన అన్ని సమాజాలకు కాలాలకు మరీ ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులను అద్దం పట్టేలా ఉంటాయని తెలియజేశారు.కార్మిక వర్గ సిద్ధాంతాన్ని చాటి చెప్పడంలో ముందున్నారు శ్రీశ్రీ. శ్రీశ్రీ విశాఖ వాసి కావడం మన అదృష్టమన్నారు. సాహిత్యాన్ని సామాన్యులకు అందించారని,శ్రీశ్రీ పేరుతో ఆంధ్రా యూనివర్సిటీ లో ఓ పీఠం ఏర్పాటు చేయాలని కోరారు.

Related Posts