YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్రంతో పోరాటానికి కలిసి రండి..

కేంద్రంతో పోరాటానికి కలిసి రండి..

కేంద్రంపై పోరాటానికి ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలని జేడీఎస్ నేత పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ చర్యలు మితిమీరిపోయాయని, ప్రజాస్వామ్యాన్ని ఆ పార్టీ హత్య చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై పోరాటానికి కలిసి రావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కోరారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కూడా ఆహ్వానించారు. కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై గురువారం  మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామి ఈ పిలునిచ్చారు. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. మా ఎమ్మెల్యేలపై ఈడీతో దాడులు చేయిస్తూ.. భయభ్రాంతులకు గురిచేస్తోంది. యడ్యూరప్పకు మద్దతిచ్చేలా అన్నిరకాల ఒత్తిళ్లకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని ఆ పార్టీ హత్య చేసింది. పవిత్రమైన రాజ్ భవన్‌ను తన పార్టీ కార్యాలయంగా మార్చేసింది. జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉన్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ మాకు అవకాశం కల్పించకుండా యడ్యూరప్పను పిలవడమే దీనికి నిదర్శనం’ అని కుమారస్వామి అన్నారు. దేశ రాజకీయాలను కాపడటానికి చొరవ తీసుకొమ్మని నా తండ్రి దేవెగౌడను కోరుతున్నా. ఆయన నాయకత్వంలో ప్రాంతీయ పార్టీల నేతలందరూ కేంద్రంపై పోరాటానికి కలిసి వస్తారని భావిస్తున్నా’ అని కుమారస్వామి అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మూడో ప్రత్యామ్నాయం ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో బెంగళూరుకు వెళ్లిన కేసీఆర్.. దేవెగౌడ, కుమారస్వామితో దేశ రాజకీయాలపై చర్చించారు. మమతా బెనర్జీ కూడా దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి చేసిన విన్నపం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Related Posts