YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చేతకాని ముఖ్యమంత్రి జగన్ మోహన్

చేతకాని ముఖ్యమంత్రి జగన్ మోహన్

మచిలీపట్నం
సిఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పడానికి తెలంగాణ మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యాలే ప్రత్యక్ష నిదర్శనమని మాజీమంత్రి, తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఏద్దేవా చేశారు.పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి, మంత్రులు సమావేశాల్లో అసమర్థ పాలనకు ఉదాహరణలుగా ఏపీని చూపించడం చూస్తే చాలా బాధకలుగుతోందని,నాడు దేశంలోనే ఒకటి రెండు స్థానాలకు పోటీపడిన రాష్ర్టం నేడు విధ్వంశకర పాలనలో పోటీపడుతూ అభివృద్ధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంతే రాష్ట్రం ఎటువెళుతుందో ఎమవుతుందో అనే భయం కలుగుతోందని అన్నారు.ఏడున్నార లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం కనీసం ఒకరోడ్డు కూడా వేయలేని పరిస్థితిలో ఉందని అన్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని అన్నారు.ఈ రాష్ట్ర చరిత్రలో చేతకాని ముఖ్యమంత్రిగా నిలిచిపోయే మొదటి వ్యక్తిగా జగన్ మోహన్ రెడ్డి అని,వీరి మంత్రులు కేవలం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని దోషించేందుకు,పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఉన్నారని అన్నారు.

Related Posts