విజయవాడ
ఏపీలో మౌలిక వసతుల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాకరేపాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై మాజీమంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ నోటి దురద తగ్గించుకుంటే మంచిదని పేర్ని నాని హితవు పలికారు. కరోనా సమయంలో జనం తమ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన విషయం గుర్తు లేదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు పేర్ని నాని. కేసీఆర్, కేటీఆర్ చెప్పేవన్నీ కేవలం మాటలే అని విమర్శించారు. అదే జగన్ ఏదైనా చెప్పారంటే, అది చేసి తీరుతారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. జగన్ మా సీఎం అయితే బాగుండు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని పేర్నినాని అన్నారు.