YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ ,జేడీఎస్ ఆందోళన

 కాంగ్రెస్ ,జేడీఎస్  ఆందోళన

కర్ణాటక సీఎంగా నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. విధానసభ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ఈగల్టన్‌ రిసార్ట్స్‌ నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో విధానసభ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌, మల్లికార్జున్‌ ఖర్గే, వేణుగోపాల్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ అనైతిక చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. 116 మంది సభ్యుల బలమున్న తమను కాదని, 104 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ పిలవడమేంటని నిలదీశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనైతిక చర్యలకు పాల్పడుతోన్న బీజేపీకి, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని సిద్ధ రామయ్య అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అసెంబ్లీలో ఉన్నది 104 మంది సభ్యులే కాదని, 222 మంది ఉన్నారనే విషయాన్ని బీజేపీ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్, ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే, కాంగ్రెస్ వాదనలతో ఏకీభవించని సర్వోన్నత న్యాయస్థానం, అతి పెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయకుండా ఆపలేమని స్పష్టంచేసింది. కానీ, కాంగ్రెస్- జేడీఎస్‌ల పిటిషన్‌ను డిస్మిస్‌ చేయకుండా శుక్రవారం ఉదయం మరోవారు వాదనలు వింటామని వెల్లడించింది. అంతేకాదు గురువారం మధ్యాహ్నంలోగా మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల పేర్లతో కూడిన లేఖను అందజేయాలని యడ్యూరప్పను ఆదేశించింది. మంగళవారం నాడు వెలువడ్డ కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాషాయదళం 104 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 38 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాయి

Related Posts