YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కోర్టు ధిక్కరణలు మంచిది కాదు

కోర్టు ధిక్కరణలు మంచిది కాదు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30,
న్యాయవ్యవస్థ ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందువల్ల దేశంలో కోర్టు ధిక్కరణ కేసులు పెరగిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ  ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కోర్టుల్లో సిబ్బందిని త్వరితగతిన నియమించాలని సీజేఐ సూచించారు. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌ వేదికగా జరిగిన హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సులో ఎన్వీ రమణ ఈ మాటలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ  ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీజేఐ ఎన్వీరమణ.. ‘ న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరముంది. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందే. అదేవిధంగా వార్డు సభ్యుడి నుంచి లోక్‌సభ సభ్యుడివరకు అందరూ న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించాల్సిందే. చట్టం అందరికీ సమానమే. అధికార వర్గం తన బాధ్యతలు సమర్థంగా, సక్రమంగా నిర్వహిస్తే కోర్టు కేసులు తగ్గిపోతాయి. అయితే కొన్ని ప్రభుత్వాలు కోర్టు ఆదేశౄలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 66 శాతం భూతగాదాలవే. అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పూర్తి నిరుపయోగంగా మారుతున్నాయి. దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కేవలం 20 మంది న్యాయమూర్తులే ఉంటున్నారు. ఫలితంగా కోర్టు్ల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేసుల పరిష్కారం కోసం కిందిస్థాయి కోర్టు్ల్లో మరింత మంది సిబ్బందిని త్వరితగతిన నియమించాలి’ అని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం అన్నారు. న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ రెండు పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలి. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందే అన్నారు. వార్డ్ మెంబర్ నుంచి లోక్ సభ సభ్యుడి వరకు అందరిని గౌరవించాలన్నారు.
అందరి విషయంలో చట్టం సమనంగా ఉంటుంది. క్షేత్ర స్థాయిలో అధికారవర్గం తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే కోర్టుల్లో కేసులు తగ్గుతాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కొందరు దుర్వినియోగ పరుస్తున్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి మరింత సిబ్బంది అవసరం అన్నారు. కోర్టుల్లో మానవ వనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుంది. కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయన్నారు. కీలక న్యాయసదస్సుకాగా సీజేఐ ఎన్వీ రమణ చొరవతో ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత ఈ సదస్సు జరిగింది. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ న్యాయమూర్తుల, ముఖ్యమంత్రుల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. అలాగే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్య నాథ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు
స్థానిక భాషల్లో  తీర్పులు ఉండాలి  
ప్రధాని స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి.. నేటికీ మన దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు వ్యవహారాలన్నీ ఇంగ్లీషులోనే జరుగుతున్నాయని.. అలా కాకుండా ప్రాంతీయ భాషలల్లో కూడా జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల పెద్ద జనాభాకు న్యాయ వ్యవస్థ ప్రక్రియ నుంచి నిర్ణయాల వరకు అర్థం చేసుకోవడం కష్టంగా మారిందని.. సాధారణ ప్రజలకు చేరువ అయ్యేలా వ్యవస్థను సులభతరం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కోర్టులలో స్థానిక భాషలను ప్రోత్సహించాలని.. ఇలా చేయడం వల్ల దేశంలోని సాధారణ పౌరులకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని.. దీంతో వారు న్యాయ వ్యవస్థతో అనుసంధానమవుతారని ప్రధాని పేర్కొన్నారు. శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి మాట్లాడారు. మన దేశంలో న్యాయవ్యవస్థ రాజ్యాంగ పరిరక్షణకు పునాది అని.. పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు.రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు మన రాజ్యాంగ సౌందర్యానికి సజీవ చిత్రమని ప్రధాని మోదీ అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యంలో న్యాయవ్యవస్థ – కార్యనిర్వాహక వ్యవస్థ రెండింటి పాత్రలు రాజ్యాంగం బాధ్యతలను ఆకాంక్షలను చాటిచెప్పిందని తెలిపారు. అవసరమైన చోట ఈ సంబంధం దేశానికి దిశానిర్దేశం చేయడానికి నిరంతరం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.2047లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుందని, అప్పటికల్లా దేశంలో అత్యుత్తమ న్యాయ వ్యవస్థను చూడాలనుకుంటున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ ఆకాంక్షలను నెరవేర్చగలిగేలా, వాటిని నెరవేర్చగలిగేలా మన న్యాయవ్యవస్థను మనం ఎలా సమర్థవంగా మార్చుకోవాలి.. అనే విషయంపై చర్చ జరగాలన్నారు.భారత ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియా మిషన్‌లో కీలకమైన భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికత అవకాశాలను పరిగణిస్తోందని మోదీ అన్నారు. దీనికి ఈ-కోర్టుల ప్రాజెక్ట్ నేడు మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం డిజిటల్ లావాదేవీలు మన దేశానికి అసాధ్యమని భావించారు. కానీ.. నేడు చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు సర్వసాధారణమైపోయాయి. ప్రజాస్వామ్యం బలోపేతానికి 3 వ్యవస్థలు పనిచేయాలి. పిల్‌లు దుర్వినియోగం అవుతున్నాయి. పిల్‌లు వ్యక్తిగత వ్యాజ్యాలుగా మారాయన్నారు సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం అన్నారు. న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ రెండు పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలి. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందే అన్నారు. వార్డ్ మెంబర్ నుంచి లోక్ సభ సభ్యుడి వరకు అందరిని గౌరవించాలన్నారు.అందరి విషయంలో చట్టం సమనంగా ఉంటుంది. క్షేత్ర స్థాయిలో అధికారవర్గం తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే కోర్టుల్లో కేసులు తగ్గుతాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కొందరు దుర్వినియోగ పరుస్తున్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి మరింత సిబ్బంది అవసరం అన్నారు. కోర్టుల్లో మానవ వనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుంది. కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయన్నారుగతేడాది ప్రపంచంలో జరిగిన డిజిటల్ లావాదేవీల్లో 40 శాతం డిజిటల్ లావాదేవీలు భారతదేశంలోనే జరిగాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు.

Related Posts