YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

తిరుమల, ఏప్రిల్ 30,
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. సామాన్య భక్తులకు తర్వతరగతిన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి భక్తులకు టోకేన్లు జారిని త్వరలోనే ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది. టీటీడీకి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని ముంబైలో కేటాయించింది.. దాని విలువ రూ. 500 కోట్లుగా ఉంటుందని.. త్వరలోనే భూమి పూజ నిర్వహించి, ఆలయ నిర్మాణం ప్రారంభించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఆలయ నిర్మాణానికి రైమెండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చినట్టు తెలిపింది.ఇక, మే 5వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులను అనుమతిఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆలయంలో 3.61 కోట్ల రూపాయలతో బంగారు సింహాసనాలు తయారు చేయించనున్నారు.. పద్మావతి మెడికల్ కాలేజీలో రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టనున్నారు. శ్రీనివాస సేతు మొదటి దశ పనులు ఇప్పటికే పూర్తి కాగా.. మే 5వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభించేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఇక, రెండో దశ పనులకు 100 కోట్లు కేటాయించామని.. మార్చి 2023కి పనులు పూర్తిచేస్తామని చెబుతున్నారు. ఐఐటీ నిపుణుల సూచన మేరకు ఘాట్ రోడ్డులో పటిష్ట చర్యలు తీసుకోవడానికి రెండో దశలలో 36 కోట్లు కేటాయించింది టీటీడీ.. వసతి గదులు మరమత్తులుకు రూ.19 కోట్లు కేటాయించగా.. బాలాజీనగర్‌లో 2.86 ఎకరాల స్థలంలో ఎలక్ట్రిక్ బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు, ఆస్థాన సిద్ధాంతిగా వేంకట కృష్ణ పూర్ణ సిద్ధాంతిని నియమించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక, 437 ఉద్యోగుల క్వార్టర్స్ మరమత్తులకు నిర్ణయం తీసుకోగా.. వస్తూ రుపేణా విరాళాలు అందించిన భక్తులుకు ప్రివిలేజస్ అందజేయనున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపు త్వరలోనే పూర్తి చేసేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి.

Related Posts