YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వివాదాలప్ప...యాడ్యురప్ప

 వివాదాలప్ప...యాడ్యురప్ప

బీఎస్  యడ్యూరప్ప.... కర్ణాటక సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.. అయితే ఆయన ఎప్పుడు ప్రమాణం  చేసినా పూర్తి కాలం పదవిలో కొనసాగ లేదు. ప్రతీసారి ఏదో గండం...ఎదరవుతూనే ఉంది..గతంలో ఆయన రెండుసార్లు సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ, ఆయన్ను దురదృష్టం వెన్నాడింది. తొలిసారి ఆయన సీఎం పదవి మూనాళ్ల ముచ్చటే కాగా, రెండోదఫా మూడేళ్లకే పరిమితం అయింది. ఇక ఈ దఫా మెజారిటీ లేకున్నా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతగా, ప్రస్తుతానికి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ,  ఏమవుతుందో అన్నఆందోళన బీజేపీ శ్రేణుల్లో నెలకొని ఉంది.యడ్యూరప్ప,   మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.  38 ఏళ్ల నుంచి  బీజేపీ సంఘ్ తో అనుబంధం ఉన్న యడ్యూరప్ప ఇప్పటి వరకు ఒక్కసారిగా పూర్తిగా అధికారంలో కొనసాగలేదు.  1983లో  శికారిపుర  శాసనసభ  నియోజకవర్గం  నుంచి కర్ణాటక  అసెంబ్లీలో  ప్రవేశించి ….అప్పటినుంచి  వరుసగా  ఏడో  సారి  అదే స్థానం  నుంచి ఎన్నికయ్యారు.2007 నవంబర్ లో  మొదటిసారిగా  కర్నాటక  ముఖ్యమంత్రిగా  పదవీ బాధ్యతలు  స్వీకరించారు.  తరువాత  జేడీఎస్  మద్దతు  ఉపసంహరణతో  రాజీనామా  చేశారు.తదనంతర పరిణామాలతో వారం రోజులకే గద్దె దిగారు...మళ్లీ  6నెలల  తరువాత  జరిగిన  ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడంతో మే 30,  2008న  రెండో సారి …కర్ణాటక ముఖ్యమంత్రిగా  ప్రమాణస్వీకారం చేశారు  యడ్యూరప్ప. దక్షిణ భారతదేశంలో  ముఖ్యమంత్రి   పీఠాన్ని అధిష్టించిన  తొలి భారతీయ  జనతా పార్టీ  నేతగా  రికార్డు  సృష్టించాడు. 2008 మే 30న రెండోసారి పదవిని చేపట్టి 3 సంవత్సరాల 62 రోజులు పదవిలో ఉన్నారు. బీజేపీ, జేడీఎస్  కూటమి  ప్రభుత్వంలో  కుమారస్వామి  సీఎంగా  ఉండగా.. యడ్యూరప్ప  ఉప ముఖ్యమంత్రిగా,  ఆర్థిక మంత్రిగా బాధ్యతలు  నిర్వహించారు. 2011లో  అవినీతి ఆరోపణలతో  యడ్యూరప్ప పార్టీకి  దూరమయ్యారు. భూకేటాయింపుల్లో  అవకతవకలు  జరిగాయన్న ఆరోపణలపై  విచారణ కూడా  ఎదుర్కొన్నారు. 2011 అక్టోబర్  15న  అరెస్టయ్యారు. 23రోజుల  జైలు  జీవితం  తరువాత …ఆయన విడుదలయ్యారు.  కానీ నేరనిరూపణ  జరగకపోవడంతో  యడ్డీని  నిర్దోషిగా  ప్రకటించింది  న్యాయస్థానం. తరువాత  మళ్లీ  యడ్యూరప్పను  బీజేపీ లోకి  ఆహ్వానించింది  అధిష్ఠానం. ప్రస్తుతం  ఆయన షిమోగ నియోజకవర్గం  నుంచి  ఎంపీగా  ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  మొన్నటి  ఎన్నికల్లో  షికారిపురా  నుంచి పోటీచేసి  ఎమ్మెల్యేగా  విజయం  సాధించిన  యడ్యూరప్ప.. కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల్లో ముచ్చటగా  మూడోసారి యడ్డీ సీఎం పీఠాన్ని అధిష్టించారు.అయితే ఇప్పుడు పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవడంతో పదవి మూణ్ణాళ్ల ముచ్చట కానుందా. వేచి చూడాలి.

Related Posts