రాజమండ్రి, మే 2,
ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంగా విడుదలైన ‘పుష్ప’ సినిమా ఇఫ్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ సినిమాలోలాగే పోలీసులకు దొరక్కుండా గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు కొత్త కొత్త టెక్నిలను ఉపయోగిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ ఎన్ని రకాలుగా చేయొచ్చో వెండి తెర మీద 70 ఎంఎంలో చూపింది పుష్ప సినిమా. అదే టెక్నిక్ ఫాలో అయ్యి గంజాయి స్మగ్లింగ్ చేసేద్దామనుకుని అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. అలా దొరికిపోయిన వారు నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ అనుచరులని ఆరోపిస్తూ తెలుగుదేశం ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో గంజాయి స్మగ్లింగ్ కు వారు అనుసరించిన టెక్నిక్, పోలీసులకు దొరికిపోయిన విధం ఉన్నాయి. లారీ కింద గంజాయి బస్తాలు పెట్టి స్మగ్లింగ్ చేస్తూ స్మగ్లర్లు దొరికి పోయిన వీడియోను తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ లో పోస్టు చేసింది. లాంగ్ ట్రాలీ ఉన్న లారీలో ఓపెన్ టాప్ ట్రాలీలో ఇనుపవైర్ల లోడు ఉంచి..ట్రాటీకీ, యాక్పిల్ కు మధ్య ఉండే ఇనుప కమ్మీలపై పెద్ద సంఖ్యలో గంజాయి బస్తాలు ఉంచారు. పోలీసుల తనిఖీలో అవి బయటపడటంతో లారీనీ, గంజాయి బస్తాలనూ సీజ్ చేసి, అందులో ఉన్న వారిని అదుపులోనికి తసుకున్నారు. ఆ లారీలో ఉన్న వారు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులని తెలుగుదేశం ఆరోపించింది. ఇంతకీ నర్సీపట్ల వైసీపీ ఎమ్మెల్యే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నథ్ సోదరుడు కావడం విశేషం.