కడప
వైకాపా పాలనలో రాష్ట్రం రేప్ ల ఆంధ్రప్రదేశ్ గా, నేరాంద్రప్రదేశ్ గా తయారయింది. రేపల్లె రైల్వేస్టేషన్ లో భర్త కళ్లెదుటే ఒక మహిళ పై ముగ్గురు కామాంధులు ఆత్యాచారం చేయడం సభ్య సమాజానికి సిగ్గు చేటని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. నిందితులు తాగిన మైకంలో ఉన్నట్టుంది తెలుస్తోంది. నేరాలు జరిగిన అనేక సందర్భాలలో నేరస్థులు మద్యం సేవించడం గానీ, లేక గంజాయి తదితర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. మత్తు పదార్థాలను అరికట్టాలి. వైకాపా ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా తయారయ్యింది. బుధవారం పదోతరగతి తెలుగు ప్రశ్న పత్రం లీకయ్యింది. గురువారం హింది ప్రశ్న పత్రం లీకయ్యిందని అన్నారు.
శుక్రవారం ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లీకయ్యింది. గతంలో ఒక్క ప్రశ్నపత్రం లీకు అయినందుకే నాటి విద్యాశాఖ మంత్రి ముద్దు కృష్ణమనాయుడు మంత్రి పదవికి రాజీనామా చేశారు. నైతిక విలువలు వుంటే, ముఖ్య మంత్రి, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని అన్నారు..