న్యూ డిల్లీ మే 2
దేశంలో విద్యుత్ సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, బొగ్గు మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.దేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడింది. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు రైల్వే శాఖ 650 రైళ్లను రద్దు చేసింది. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా సక్రమంగా, వేగంగా సరఫరా చేసేందుకే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది.