YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

అమరావతి మే 2
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరోసారి కీలక పదవి దక్కింది. ఉమ్మారెడ్డిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులు కావడం వరుసగా ఇది రెండోసారి.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును సీఎం జగన్‌ నియమించారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తయిన ఉమ్మారెడ్డి.. ఇటీవలే గుంటూరు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి మరోసారి మండలికి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను మరోసారి కౌన్సిల్‌లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా కొనసాగించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. దాంతో ఉమ్మారెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

Related Posts