YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టమటా.. మోత మ్రోగిస్తోంది

టమటా.. మోత మ్రోగిస్తోంది

విజయనగరం, మే 3,
వినియోగదారులకు టమోటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. విజయనగరం జిల్లా లావేరు మార్కెట్ పరధిలో పది రోజుల క్రితం కిలో టమోటా ధర రూ.20గా ఉంది. అయితే ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.60కి పెరిగింది. దీంతో టమోటాలను కొనాలంటే ప్రజలు జంకుతున్నారు. తమ నుంచి వ్యాపారులు కిలో రూ.10కి కొని.. ఇప్పుడు తమ వద్ద పంటలేని సమయంలో వ్యాపారులు సిండికేట్ అయ్యి రూ.60కి అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుమరోవైపు ఎండ వేడికి దిగుబడి తగ్గడం, పంట వాడిపోవడంతో టమోటాలకు డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని బహిరంగ మార్కెట్లలో ఎక్కువ ధరలకు విక్రయాలు చేస్తున్నారు. అటు మదనపల్లి మార్కెట్‌లోనూ టమోటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారం రోజల క్రితం నాణ్యమైన టమోటా రూ.30 నుంచి 35 పలకగా, రంజాన్‌ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఆదివారం కిలో టమోటా గరిష్టంగా రూ.55 పలికింది.ఏ కూర వండుకున్నా అందులో టమాటా ఉండాల్సిందే. వంటింట్లో ఏ కూరగాయ లేకున్నా.. టమాటా మాత్రం ఉండాల్సిందే. అయితే గత కొద్ది రోజులుగా టమాటా ధరలు మంటెక్కిపోతున్నాయి. నెల రోజుల క్రితం ధర లేక నేల చూపులు చూసిన టమాటా ఇప్పుడు మోత మోగిస్తోంది. కిలో ధర ఏకంగా రూ. 40కి పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రూ.50పలుకుతోంది. రైతుబజార్లలోనే అధికారికంగా కిలో రూ.28కి నిర్ణయించారు. ఇక ఏసీ పెట్టి అమ్మే దుకాణాల్లో అయితే ఏకంగా రూ.60కి అమ్మేస్తున్నారు. మరోవైపు.. వేసవి కావడంతో ఎండల వేడిమికి పంటలు ఎండిపోయాయి. జిల్లాల నుంచి విపరీతంగా వచ్చే టమాటా పంట ఇప్పుడు కనుమరుగైంది. ఇతర కూరగాయల పంటలన్నీ ఎండిపోవడంతో పాలీ హౌస్‌ల ద్వారా పండించినవే ఇప్పుడు మార్కెట్‌కు వస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూరగాయల సరకులు వస్తుండటంతో రవాణా ఖర్చులు కూడా కలపడంతో ధరలు పెరిగిపోయాయి. ఆకస్మాత్తుగా పెరిగిపోయిన ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలో కొనే వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. టమాటాలే కాకుండా ఇతర కూరగాయల లభ్యత కూడా తక్కువగా ఉంది

Related Posts