YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుంటూరులో రాజకీయ రంగు..

గుంటూరులో రాజకీయ రంగు..

గుంటూరు, మే 3,
గుంటూరు జిల్లాలో ఓ భూవివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. తాడేపల్లిలోని ఓ ప్రాంతంలో తమ భూమిలో నాగి రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేశాడని , తమ పై దాడి చేశాడని కోటేశ్వరావు అనే వ్యక్తి ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి అనే వ్యక్తిపై అతనికి మద్దతు ఇస్తున్న వారిపై కోటేశ్వరరావు రాజకీయంగా ఆరోపణలు చేయడంతో ఇప్పుడు వివాదం రాజకీయ రంగు పులుముకుంది.గుంటూరు జిల్లా తాడేపల్లి లోని పొలకం పాడులో ఓ భూ వివాదం టీడీపీ వర్సెస్ వైసీపీ పార్టీల పోరుగా మారుతోంది. తాడేపల్లి ప్రాంతానికి చెందిన కోటేశ్వర రావు, శ్రీనివాస రావు అన్నదమ్ములు. తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఏడు సెంట్ల స్థలంలో అన్నదమ్ములు ఇద్దరికీ వాటా ఉంది. అయితే ఇందులో శ్రీనివాస్ రావ్ అనే వ్యక్తి నాగిరెడ్డి అనే వ్యక్తికి స్థలం అమ్మేశాడనీ మిగిలిన భాగం కోటేశ్వర రావు పేరుతో ఉంది. అయితే తమ్ముడు శ్రీనివాసరావును భూమి అమ్మడానికి వీలు లేదని అన్న కోటేశ్వరరావు చెప్పడంతో కోటేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది.ఈ వివాదాల నేపథ్యంలో నాగి రెడ్డి అనే వ్యక్తి తమ ఇంటిపై దౌర్జన్యానికి వచ్చాడని, దాడి చేసి మమ్మల్ని కొట్టాడని కోటేశ్వర రావు ,అతని కుటుంబం ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ కావడం… ఆ తర్వాత కోటేశ్వరరావు టిడిపి నాయకులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిపోయాయి. భూ యజమాని కోటేశ్వరరావు చేసిన ఆరోపణల పై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఘటన స్థలానికి చేరుకుని అక్కడ స్థానికులతో మాట్లాడారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి జరిగిన విషయం పై మీడియాకి వివరణ ఇచ్చారు. నాగిరెడ్డి కొనుక్కున్న భూమి లోకి వెళ్లేందుకు వస్తుంటే కోటేశ్వరరావు అడ్డుకునే ప్రయత్నం చేశాడని, పైగా ఈ చిన్న భూ వివాదాన్ని పార్టీల వివాదంగా మార్చి లబ్ధి పొందాలని కోటేశ్వరరావు అతని కుటుంబం చూస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపిస్తున్నారు. మొత్తంగా అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఓ చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలకు వివాద వేదికగా మారింది. దీనిపై పోలీసులతో దర్యాప్తు చేయించి అసలు కారణాలు బయట పెడతానని అంటున్నారు ఎమ్మెల్యే ఆర్కే

Related Posts