తెనాలి
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మర్మాంగం కోసిన ఘటన సోమవారం రాత్రి పట్టణంలో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన ఎస్ రామచంద్రారెడ్డి ఐదేళ్ల క్రితం తెనాలి వచ్చాడు . అతనికి ఐతానగర్ కు చెందిన సంధ్య అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది .రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జి లో ఉంటు కూలిపనిచేసే రామచంద్ర రెడ్డి సోమవారం రాత్రి సంధ్యతో కలిసి మద్యం సేవించే ఆమె నివాసం ఉండే భవనంపై నిద్రిస్తున్నారు. అదే సమయంలో సంధ్య కుమార్తే, మరో యువకుడు భవనం పైకి వచ్చి రామచంద్ర రెడ్డి తో గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో అతని మర్మాంగం కోసేశారు. బాధితుడి కేకలు విన్న చుట్టుపక్కల వారు అతన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు .విషయం తెలుసుకున్న టుటౌన్ సిఐ కోటేశ్వరరావు ఆస్పత్రికి చేరుకుని బాదితుడి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.