కాకినాడ
కాకినాడ ఈద్గా మైదానం వద్ద రంజాన్ ప్రార్థనలకు వచ్చిన వెయ్యి మంది ముస్లిం పౌరులకు మత సామరస్యతకు ప్రతీకగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని స్వయంభు శ్రీభోగి గణపతిపీఠం నిర్వహిం చింది. ఈద్గా లో రంజాన్ ప్రార్థనల అనంతరం ముస్లిం మసీదు ప్రార్థనల మత గురువు రజాక్ తో బాటుగా నగరానికి చెందిన పలు ప్రార్థనా గురువులు ప్రముఖుల ను కలిసిన సందర్భంగా పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పరస్పరంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.మతసామర స్యతకు ప్రతీకగా హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు బౌద్ధ సోదరులందరూ భారతీయ ప్రగతికి ప్రతీకగా ప్రతి పండుగల్లో కలిసి మెలిసి భాయి భాయి గా వుందామని రజాక్ పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలో కులం మతం లేకుండా సేవలు చేసుకున్నామని గుర్తు చేశారు. ప్రార్థనలకు వచ్చిన పౌరులకు హిందూ సోదరులు చల్లని మజ్జిగ అందించిన సమైక్యతా దృక్పథం పట్ల రజాక్ ప్రగాఢహర్షం వ్యక్తం చేశారు. వెల్ఫేర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హాసన్ షరీఫ్ ఫ్రెండ్స్ యూత్ మజ్జిగ పంపిణీ పర్యవేక్షణలో సహకరిం చారు.