న్యూఢిల్లీ మే 3
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచంలో రెండవ ర్యాంక్ సాధించింది. అఫీషియల్ ఎయిర్‌లైన్ గైడ్(ఓఏజీ) నివేదిక ప్రకారం మార్చి 2022లో రిలీజైన రిపోర్ట్‌లో ఢిల్లీ విమానాశ్రయం రెండవ అత్యంత బిజీ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది. ర్యాంకింగ్స్‌లో దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌ను వెనక్కి నెట్టేసి ఢిల్లీ విమానాశ్రయం రెండవ స్థానానికి చేరింది. అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్ట్.. అత్యంత రద్దీ లిస్టులో తొలి స్థానంలో ఉంది. 2019లో రద్దీ ఎయిర్‌పోర్ట్ జాబితాలో ఢిల్లీ విమానాశ్రయం 23వ స్థానంలో ఉంది. ఢిల్లీ మూడేళ్లలో 21 స్థానాలను జంప్ చేసింది. మార్చి నెలలో అట్లాంటా విమానాశ్రయం నుంచి 44 లక్షల మంది, ఢిల్లీ నుంచి 36 లక్షలు, దుబాయ్ నుంచి 35 లక్షల మంది ప్రయాణం చేశారు. ప్రస్తుతం ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తున్నారని, దీంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నట్లు సీఈవో విదేహ్ కుమార్ జైపురియార్ తెలిపారు.