YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీపీసీ సింహాద్రిలో

ఎన్టీపీసీ సింహాద్రిలో

ఎన్టీపీసీ సింహాద్రిలో 4 యూనిట్లలోని విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. 2 వేల మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం అత్యవసర మరమ్మతు పనుల్లో నిమగ్నమైంది. ఒకేసారి 4 యూనిట్లలోనూ విద్యుత్‌ ఉత్పత్తి ఎప్పుడూ నిలిచిపోలేదు. గ్రిడ్‌ నుంచి కూడా ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్‌ సరఫరా కావడంలేదు. మరోవైపు అర్ధరాత్రి నుంచి పరవాడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు ఆధారమైన కలపాల 400 కేవీ విద్యుత్ స్టేషన్‌కు గ్రిడ్‌ నుంచి సరఫరా నిలిచిపోయింది. దాదాపు రెండున్నర గంటల తర్వాత విజయనగరం జిల్లా మరడం 400 కేవీ విద్యుత్ స్టేషన్ నుంచి పాక్షికంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు.

Related Posts