పార్వతీపురం
మన్యం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహాం ధ్వంసం కావడంకలకలం రేపింది. గోపాలపురానికి చెందిన వ్యక్తి విగ్రహాన్ని తొలగించి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మతి స్థిమితం సరిగా లేకపోవడంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. సదరు వ్యక్తి జనసేనకు సపోర్ట్ చేస్తూ, టీడీపీ, బీజేపీ, వైసీపీ ని దూషించాడు.