సింహాచలం
అప్పన్న భక్తుడి అత్యుత్సాహాం చందనోత్సవంలో కలకలం రేపింది.అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఆపై ఆలయ సిబ్బంది రక్షణ వలయంలో భక్తులను నిరంతరం కటాక్షించే అప్పన్నస్వామి వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది.గతంలో ఎన్నడూ చూడని విదంగా వీడియో బయటకు రావడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల వైఫల్యం , సిబ్బంది భద్రతా లోపంతో అతి సున్నితమైన అంశాలు వివాదస్మదంగా మారుతున్నాయి.చందనోత్పవం రోజున భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారుల మాటలే తప్ప చేతల్లో లేదని మరోసారి రుజువు కావడం అధికార వర్గాల్లో గుబులు రేపుతోంది.
చందనోత్సవంతో సింహగిరి దేదీప్యమానంగా కాంతులీడుతోంది.ఏటా వైశాఖ శుక్ల పక్ష తదియ రోజున సంప్రదాయ బద్ధంగా చందనోత్స వాన్ని నిర్వహించారు.చందన స్వామి చందనోత్సవం శుభగడి యాలతో విశాఖ సింహగిరి మురుసిపోయింది.ఏటా వైభవంగా జరిగే చందనోత్సవంలో కీలక ఘట్టం ఆలయ ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆశోక్ గజపతి రాజు తొలి దర్శనం చేసుకున్నారు.ఆలయ సంప్రదా యం ప్రకారం చందనోత్సవం పర్వదినాన తొలి పూజ నిర్వహించడం ఆనవాయితీ.కుటుంబ సభ్యులతో కలిసి పూజ చేసిన అనంతరం భక్తులకు స్వామివారి దివ్య దర్శనం కల్పిస్తారు.ఆలయానికి వచ్చిన పూస పాటి ఆశోక్ గజపతి రాజు ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి తీసుకొని వెళ్లారు. చందనోత్సవం సందర్భంగా వారం రోజుల ముందు నుంచి సన్నాహాలు ప్రారంభిం చిన ఆలయ అధికారులు ... ఈ సారి జరిగే చందనోత్స వానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు సామాన్య భక్తులకు దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
భక్తుల కోలాహలంతో విశాఖ సింహగిరి పులకించింది. సరిగ్గా రెండేళ్లుగా స్వామి వారి నిజరూప దర్శన భాగ్యాన్ని కోల్పోయిన అప్పన్న భక్తులు ఈ సారి మది నిండా స్వామివారి నామస్మరనాన్ని జపిస్తూ గర్భగుడి వైపు సాగారు.అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా సింహగిరికి తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.ఆరంభంలో వరుణుడు కాస్త ఇబ్బందులు పెట్టిన తర్వాత తెలిపినివ్వడంతో భక్తులు స్వామి వారి దర్శనాన్ని పొంది పునితులైయ్యారు.ఇదంతా బాగానే ఉన్నా భద్రతా లోపాలు మాత్రం వీడటం లేదు.సీసీ కేమేరాల పర్యావేక్షణ,పోలీసుల పహారా ఎక్కడా భద్రతా లోపాలు తలెత్తకుండా ఎక్కడిక్కడ వలం ఇవన్నీ తెటతెల్లమని మరోసారి తేలిపోయింది.చందనోత్పవం రోజున సాక్షాత్తు అప్సన్నస్వామి వారి వీడియో బయటకు రావడంతో హిందువులు ఆందోళన చెందుతున్నారు.అయితే అధికారులు మాత్రం భక్తుల అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినా భద్రతా పరంగా చిన్నపాటి లోపాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్పి వస్తోంది.ఇప్పుడు ఇదే జరిగిందని బయటకు వచ్చిన వీడియో ద్వారా నిరూపితమైంది.అయితే దీనిపై అధికారులు విచారణ జరిపి భాద్యులను గుర్తించాల్సిన ఎంతైనా ఉందని చెప్పాలి.భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.