అనంతపురం
రాప్తాడు మండలం బొమ్మేపర్తి వద్ద టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. బొమ్మేపర్తి గ్రామానికి వెళుతున్న పరిటాల శ్రీరామ్ కు పోలీసులు అడగడుగునా అడ్డంకులు సృష్టించారు. గ్రామాల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డు పడ్డారు. బొమ్మేపర్తి గరామలో గ్రామంలో వైసిపి నాయకుడు చిట్టి బాల తిరుపతిరెడ్డి గృహప్రవేశానికి పరిటాల శ్రీరామ్ వచ్చారు. అయితే పరిటాల శ్రీరామ్ పర్యటనకు పర్మిషన్ లేదంటూ పోలీసులు బొమ్మేపర్తి ముఖద్వారం వద్దే అడ్డుకున్నారు. పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకుడు చిట్టి బాల తిరుపతిరెడ్డి అనుచరులు టీడీపీ తీర్థం పుచుకుంటున్నారు. దీనితో ఎక్కువ సంఖ్యలో వాహనాలు వెళ్లకూడదని పోలీసుల కొత్త నిబంధనతో అడ్డుకున్నారు. జాతరకు కూడా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా అంటూ పోలీసులను శ్రీరామ్ సూటి ప్రశ్న వేశారు. చివరకు పరిటాల శ్రీరామ్ వాహణంతో పాటు మరో మూడు వాహనాలకు గ్రామంలోకి పోలీసులు అనుమతి ఇచ్చారు. శ్రీరాంకు బొమ్మేపర్తి గ్రామవాసులు ఘనస్వాగతం పలికారు. పరిటాల శ్రీరామ్ కు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.