నెల్లూరు
తిరుపతి రుయా ఆస్పత్రి అంబులెన్స్ సిబ్బంది ఘటన మరువక ముందే మరోచోట అదే పరిస్థితి ఏర్పడింది. ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి... తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి 108 వాహనాన్ని అడిగితే... నిబంధనలు అంగీకరించవంటూ నిరాకరించారు. ఎవరూ సాయం చేయకపోవడంతో చేసేదేమీ లేక బాలుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపైనే ఇంటికి తీసుకెళ్లిన దయనీయమైన ఘటన అందరినీ కలచివేసింది.
ద్విచక్ర వాహనం పైనే బాలుడి మృతదేహం తరలించని ఘటన మరోసారి జరిగింది. నెల్లూరు జిల్లా సంగంలో అమానుష ఘటన ఇది. బహుర్భుమి కి వెళ్లి కనిగిరి జలాశయం లో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు పడిపోయారు. శ్రీరామ్ (8) అనే చిన్నారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బంధువులు తరలించారు. అయితే అప్పటికే శ్రీరామ్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. 108 వాహనం ద్వారా మృతదేహాన్ని తమ నివాసానికి చేర్చాలని కుటుంబ సభ్యులు కోరారు. - నిబంధనలు అంగీకరించవని సిబ్బంది సమాధానం చెప్పారు. మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేకుడా పోయింది. - ఆటోలు, ఇతర వాహనాలను బ్రతిమాలినా డ్రైవర్లు ఒప్పుకోలేదు. దాంతో, బంధువులు, బైక్ పైన శ్రీరామ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.