YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ నాయకుల సమావేశం...

వైసీపీ నాయకుల సమావేశం...

విశాఖ
తాను మంత్రి కంటే ముందు వైఎస్సా ర్సీపీ కార్యకర్తనని గుడివాడ అమర్నా థ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహ న్ రెడ్డికి పార్టీ శ్రేణుల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలియజేశారు. విశాఖ నగరంలోని వైసీపీ కార్యాల యంలో జిల్లా అధ్యక్షుడు ముత్తం శెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమన్వయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు మరింత కష్టపడి పనిచేసి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నీ నిల పెట్టాలని కోరారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి , నగర వైసిపి అధ్యక్షుడు ముత్తం శెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ వెంకట కుమారి, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ కళ్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కే కే రాజు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts