అమరావతి మే 5
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వరుస మానవీయ సంఘటనలపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రభుత్వ తీరులో మార్పు రాదా అని ట్విట్టర్ వేదిక ద్వారా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. వరుస ఘటనలను ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఎందుకు సమీక్షించడం లేదని పేర్కొన్నారు.తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ నిర్వాహకుల వైఖరి మరిచిపోకముందే నెల్లూరు జిల్లా సంగం గ్రామంలో అంబులెన్స్ లేకపోవడంతో ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన ఘటన చోటు చేసుకుందని అన్నారు. ఇదే జిల్లాలో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం కోసం సిబ్బంది రూ.15 వేలు డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రచార వ్యామోహంతో ప్రారంభించిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. అంబులెన్స్ నిర్వహణ విజయ సాయిరెడ్డి అల్లుడికి కట్టబెట్టాకే ఈ దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.