శ్రీనగర్ మే 5
జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పాక్ సరిహద్దుల వెంబడి ఓ సొరంగం బయటపడింది. ఇది పాక్‌కు అత్యంత సమీపంలోనే ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాంబా సెక్టార్‌లోని చక్‌ఫకీరా చెక్‌పోస్ట్ సరిహద్దు సమీపంలో బీఎస్‌ఎఫ్ జవాన్లు గుర్తించారు. దీంతో అది ఎక్కడి నుంచి ఉందనే విషయాన్ని గుర్తించడానికి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అంతర్రాష్ట్రీయ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఈ సొరంగం ఉందని తేలింది. తాజాగా జరిగిన అక్రమ చొరబాట్లు దీనిగుండానే జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు.భారత భూభాగంలో ఉన్న సొరంగ ముఖద్వారం అంతర్జాతీయ సరిహద్దులో 150 మీటర్ల నుంచి 200 మీటర్ల దూరంలో ఉందని భావిస్తున్నారు. కాగా, అమర్‌నాథ్ యాత్రను అడ్డుకోవడానికే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ ఏర్పాటు చేసుకున్నారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో జమ్ముకశ్మీర్‌లో బయటపడిన ఐదో సొరంగం కావడం విశేషం.