YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాష్ట్రాలను వేధిస్తున్న కరెంటు కొరత.. 1100 రైళ్లు రద్దు..

రాష్ట్రాలను వేధిస్తున్న కరెంటు కొరత.. 1100 రైళ్లు రద్దు..

న్యూఢిల్లీ మే 5
దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలను కరెంటు కొరత వేధిస్తున్నది. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతుండటం, వేడి గాలులు వీస్తుండటంతో నానాటికి కరెంటుకు డిమాండ్‌ పెరిగిపోతున్నది. అయితే బొగ్గు కొరత ఏర్పడటంతో డిమాండ్‌కు తగినట్లు విద్యుత్‌ ఉత్పత్తి అవడంలేదు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే రంగంలోకి దిగింది. విద్యుత్‌ కేంద్రాలకు త్వరితగతిన బొగ్గును తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. దీనికోసం గూడ్స్‌ రైళ్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నది. ఇందులోభాగంగా భారీగా ఎక్స్‌ప్రెస్‌‌, ప్యాసింజర్‌ రైళ్లను రద్దుచేసింది. దీంతో ఈ నెల 24 వరకు దేశవ్యాప్తంగా 1100 రైళ్లను నిలిపివేయనున్నారు.ఇలా రద్దయినవాటిలో 500 ట్రిప్పుల ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌ రైళ్లు, 580 ట్రిప్పుల ప్యాసింజర్‌ రైళ్లు ఉన్నాయి. ఏప్రిల్‌ 29న నాలుగు వందల బొగ్గు రైళ్లను నడపడానికి అనుగుణంగా 240 ప్యాసింజర్‌ ట్రెయిన్స్‌ను భారతీయ రైల్వే రద్దుచేసిన విషయం తెలిసిందే.కాగా, దేశవ్యాప్తంగా వచ్చే నెలరోజులపాటు కరెంటుకు భారీగా డిమాండ్‌ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. దీనికి అనుగుణంగా విద్యుదుత్పత్తి కేంద్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నది. అయితే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన కార్మికుల సమ్మె వల్ల దేశవ్యాప్తంగా బొగ్గుకు కొరత ఏర్పాడించిందని అధికారులు వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కరెంటుకు భారీగా డిమాండ్‌ ఉన్నది. అయితే దానికి తగినట్లుగా విద్యుత్‌ సరఫరా లేకుపోవడంతో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. పవర్‌ హాలిడేలు ప్రకటిస్తున్నారు.

Related Posts