చండీఘడ్ మే 5
హర్యానాలోని ఓ టోల్ ప్లాజా వద్ద ఇవాళ నలుగురు అనుమానిత ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌తో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్‌కు ఆ పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఖలిస్తానీ ఉగ్రవాదులకు పాకిస్థాన్‌తో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుర్మీత్. గతంలో అతను జైలు జీవితం అనుభవించాడు. గుర్మీత్‌తో పాటు మరో ముగ్గురు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు పేలుడు పదార్థాలు డెలివరీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐతో ఆ నలుగురికి లింక్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.హర్యానాలోని కర్నల్స్ బస్ట్రా టోల్ ప్లాజా వద్ద ఆ నలుగుర్ని ఉదయం 4 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. టయోటా ఇన్నోవా వైట్ కలర్ కారులో వాళ్ల ఢిల్లీ వైపుగా వెళ్తున్నారు. గుర్మీత్‌తో పాటు ఉన్న మరో ముగ్గుర్ని భూపిందర్, అమన్‌దీప్, పర్మిందర్‌గా గుర్తించారు. అందరూ పంజాబీలే అని పోలీసులు తేల్చారు. పాకిస్థాన్ ఉగ్రవాది హర్వింద్ సింగ్ నుంచి ఆదేశాలు తీసుకుని ఈ నలుగురు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.ఐఈడీలను ఆ కారులో తీసుకువెళ్తున్నారు. వాటిని ఇండియా అంతా డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. అరెస్టు కావడానికి ముందు కనీసం రెండు స్థలాల్లో ఐఈడీలను పంచి ఉంటారని భావిస్తున్నారు. దేశవాళీ పిస్తోల్, 31 బుల్లెట్లు, ఐఈడీలతో ఉన్న మూడు ఐరన్ కంటేయినర్లు,1.3 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ నలుగురు కొరియర్లుగా ఆదిలాబాద్‌కు ఆయుధాలను చేరవేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని కర్నాల్ రేంజ్ ఐజీ సత్యేందర్ కుమార్ గుప్తా తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిచి, పోలీసు రిమాండ్‌లోకి తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కంటేయినర్లలో ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించారు.