విశాఖపట్నం
ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు విశాఖలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 2029నాటికి దేశంలోని నెంబర్ వన్‌గా తీర్చి దిద్దాల్సిన ఆంధప్రదేశ్‌ను వైఎస్ జగన్ నాశనం చేశారని విమర్శించారు. జగన్ జే బ్రాండ్‌కు, గంజాయి, డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా రాష్ట్రం మారిందని.. 8 లక్షల నుంచి 10 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు.టీడీపీలో పదవులు రావాలంటే ప్రజలతోనే ఉండాలన్నారు చంద్రబాబు.పార్టీ సభ్యత్వం సులభతరం చేస్తున్నామని.. శాశ్వతంగా టీడీపీ అధికారంలో ఉండాలన్నారు. గ్రామానికి ఒక రౌడీని సైకోని జగన్ రెడ్డి తయారు చేశారన్నారు. సైకోలను పూర్తిగా అణిచివేస్తామని.. ఇలాంటి వాళ్లను చాలామందిని చూసామన్నారు. తీవ్రవాదులు, ముఠా నాయకులను, మతోన్మాధులను అణిచివేసిన పార్టీ టీడీపీ అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని.. ప్రజల్ని భాాగస్వామ్యం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కేసులు గురించి ఎవరూ భయపడొద్దని పార్టీ అండగా ఉంటుందన్నారు.
గంజాయి పసికట్టేందుకు శునకాల సేవలు :
గంజాయిని రవాణాను అరికట్టేందుకు ఇప్పుడు శునకాలు రంగంలోకి దింపారు విశాఖ పోలీసులు.అక్కడా ఇక్కడ అనే తేడా లేకుండా మత్తు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వాలు, పోలీసులు.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్‌కు ఎండ్ కార్డు వేయలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే డ్రగ్స్ లభ్యమవుతూనే ఉన్నాయి.పోలీసుల కళ్లుగప్పి భారీ కంటైనర్,ఇతర మార్గాల్లో రవాణా చేస్తున్న గంజాయిని గుర్తించే క్రమంలో పోలీసులకు కష్టతరంగా మారుతోంది.దీన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని నిందితులను పట్టించే సామర్ధ్యం ఉన్న శునకాలను రంగంలోకి దింపిన పోలీసులు ఇప్పటికే ఫలితాలను సాదిస్తున్నారు.బయట నుంచి శిక్షణ ఇచ్చి విశాఖకు తీసుకొచ్చిన శుకనాల ద్వారా గంజాయిని పట్టుకొవడం జరిగిందని సీపీ శ్రీకాంత్ తెలిపారు.