తిరుపతి
సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారంనేడు తిరుపతిలో పర్యటించారు. నూతన జిల్లాల ఆవిర్భావంలో భాగంగా తిరుపతి జిల్లాగా ఏర్పాటైన విషయం విధితమే. కాగా తిరుపతి జిల్లా ఏర్పాటైన తొలిసారి సీఎం జగన్ పర్యటించారు.. ఈ పర్యటనలో భాగంగా విద్యా దీవెన పథకం సభలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేసారుఏ. పర్యటనలో భాగంగా ఉదయం 10.45 గంటలకు సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ఎస్ వి వెంటర్నరీ కళాశాల కు చేరుకున్నారు. తరువాత ఎస్.వి. స్టేడియంకు చేరుకొని విద్యా దీవెన బహిరంగ సభలో పాల్గొన్నారు. విద్యా దీవెన పథకం కింద జనవరి – మార్చి త్రైమాసానికి సంబంధించి నగదును జగన్ విడుదల చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 10.85 లక్షల మంది విద్యార్థులకు 709 కోట్ల రూపాయలు అందించనుండగా.. ఒక్క బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసారు.