YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పొంచి ఉన్న ఇసుక కొరత

పొంచి ఉన్న  ఇసుక కొరత

న్యూఢిల్లీ, మే 5,
భవిష్యత్తులో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. వినియోగం ఇలాగే కొనసాగితే భూగోళం మీద నుండి ఇసుక మాయమయ్యే ప్రమాదం కూడా ఉందని పేర్కొంది. ఈ మేరకు యునైటెడ్‌ నేషన్‌ ఎన్విరాన్‌మెంటు ప్రోగ్రామ్‌ (యుఎన్‌ఇపి) హెచ్చరించింది. నానాటికీ భూమ్మీద ఇసుక కనుమరుగవుతోందని పేర్కొంది. 'ఇసుక వనరులపై మెరుగైన నియంత్రణ ఉండాలి.విచ్చలవిడిగా చేస్తున్న వినియోగాన్ని తక్షణం మానుకోవాలి.' అని సూచించింది. ప్రస్తుతం ప్రపంచం ప్రమాదం ముంగిట ఉందని తక్షణము చర్యలు చేపడితేనే ఇసుక సంక్షోభాన్ని తప్పించుకోగలమని యుఎన్‌ఇపి ఎకానమీ విభాగ అధిపతి షీలా అగర్వాల్‌ ఖాన్‌ తెలిపారు. వేల ఏళ్లు భౌగోళిక ప్రక్రియ ద్వారా ఇసుక ఏర్పడుతోందని, దాని ఆవిర్భావం కంటే వేగంగా ఇసుకను వినియోగించుకుంటున్నామని యుఎన్‌ఇపి తెలిపింది.ఇసుక వినియోగం గత రెండు దశాబ్దాలుగా మూడు రెట్లు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 50 బిలియన్‌ టన్నుల ఇసుక వినియోగమవుతుంది. దీనికోసం విచ్చలవిడిగా చేస్తున్న తవ్వకాలు నదులు, తీర ప్రాంతాలకు హానికరంగా మారుతున్నాయి. చిన్నచిన్న దీవులను తుడిచిపెట్టుకుపోతున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనివల్ల పర్యావరణ సంక్షోభం ఏర్పడుతోందని పేర్కొంది. 'పర్యావరణాన్ని నియంత్రించడంలో ఇసుక కీలకపాత్ర పోషిస్తోంది. తుపానుల నుంచి రక్షించడంతోపాటు అనేక వృక్ష, జంతు జాతులకు ఆవాసంగా మారుతోంది. నియంత్రణ లేని ఇసుక వినియోగం వల్ల పర్యావరణానికి భంగం కలగడంతోపాటు జీవవైవిధ్యంపైనా ఒత్తిడి కలిగిస్తోంది. తీర ప్రాంతాల్లో ఇసుక తగ్గడంతో శక్తిమంతమైన తుపానులు వచ్చే ప్రమాదం ఉంటోంది' అని యుఎన్‌ఇపి వెల్లడించింది.'ఈ భూమ్మీద ఉండే పెద్ద పెద్ద శిలలు వాతావరణ ప్రభావం వల్ల కాలం గడిచే కొద్దీ అరుగుతూ.. వివిధ పదార్థాలుగా విడిపోతాయి. ఆమ్ల వర్షాల వల్ల రసాయన సంఘటనలు ఏర్పడి ఆ శిలలు ఖనిజాలు, క్వార్ట్‌ ్జ (సిలికా), పొటాషియం, సోడియం, అల్యూమినియం క్రిస్టల్స్‌గా విడిపోతాయి. అలా ఏర్పడిన సిలికా ఇసుక రేణువులుగా రూపాంతరం చెందుతుంది. నదుల్లో నీటీ ప్రవాహం కారణంగా రాళ్లు కొట్టుకొనిపోతూ రాపిడికి గురై రాళ్ళు చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి ఇసుకగా ఏర్పడుతుంది. అందుకే నదులలో, బీచ్‌లలో ఇసుక ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా మారడానికి వందలు, వేళ్లు సంవత్సరాలు పడుతుంది. ఇలా వేల సంవత్సరాలుగా పోగుపడిన ఇసుకలో అత్యధిక భాగాన్ని రకరకాల అవసరాల పేరుతో ఇప్పటికే వినియోగించేశాం. మరోవైపు కొత్త ఇసుక ఆవిర్భావానికి అవసరమైన సమయం ఇవ్వడం లేదు. నదీ పరివాహ ప్రాంతాల్లోని కొండలను ధ్వసం చేస్తున్నాం. దీంతో కొరత ముంగిట్లోకి ప్రపంచం చేరింంది' అని నివేదికలో పేర్కొన్నారు.

Related Posts