YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సగానికి పడిసోయిన గోధుమల ఉత్పత్తి

సగానికి పడిసోయిన గోధుమల ఉత్పత్తి

భోపాల్, మే 5,
ఏడాది గోధుమ పంట దిగుబడిపై వడగాలులు తీవ్ర ప్రభావం చూపాయి. వరుసగా ఐదేళ్ల పాటు రికార్డు స్థాయిలో గోధుమ పంట దిగుబడి నమోదైన సంగతి తెలిసిందే. దీంతో గోధుమల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచలోనే రెండవ అతిపెద్ద దేశంగా నిలిచింది. అయితే ఈ ఏడాది మార్చి మధ్య నుండే ఉష్ణోగ్రతలు అధికమవడంతో దిగుబడి తగ్గనుంది. ఈ తగ్గుదల గోధుమల ఎగుమతులపై ప్రభావం చూపనుంది.రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా గోధుమల ధర పెరగడంతో.. ఈ ఏడాది మార్చి వరకు భారత్‌ రికార్డుస్థాయిలో 7.85 మిలియన్‌ టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. గతేడాదితో పోలిస్తే 275 శాతం పెరిగింది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 12 మిలియన్‌ టన్నులను ఎగుమతి చేయాలని భారత్‌ అంచనా వేసింది. భారత్‌ ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయిలో గరిష్టంగా 111.32 మిలియన్‌ టన్నుల ధాన్యం దిగుబడి కానుందని, గతేడాది దిగుబడి కన్నా 109.59 మిలియన్‌ టన్నులు అధికమని ఫిబ్రవరి మధ్యలో ప్రభుత్వం ప్రకటించింది. రాయిటర్స్‌ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఉత్పత్తి 105 మిలియన్‌ టన్నులకు పడిపోవచ్చని వెల్లడించింది.ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, తీవ్ర వడగాలులు కారణంగా సుమారు 20 శాతం గోధుమ గింజలు శుష్కించి పోవడంతో అధికారిక లెక్కల ప్రకారం.. గోధుమ ఉత్పత్తి నష్టం 6 శాతం పెరగవచ్చు లేదా తగ్గవచ్చని నివేదిక పేర్కొంది.ఏడాది భారత్‌లో 122 ఏళ్లలో మార్చి నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత 33.1 డిగ్రీల సెల్సియస్‌కి పెరిగింది. సాధారణం కంటే సుమారు 1.86 డిగ్రీల సెల్సియస్‌ అధికమని వాతావరణ శాఖ నివేదించింది. సమాచారం మేరకు పంట నష్టం ఎంత మేర పెరిగింది అనేది స్పష్టం చేయడానికి కొంత సమయం పడుతుందని సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ దశలో పంట దిగుబడిపై ఎవరికీ స్పష్టమైన అవగాహన ఉండదని న్యూఢిల్లీకి చెందిన వ్యాపారి రాజేష్‌ పహారియా జైన్‌ తెలిపారు.ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్పత్తి అంచనాల ఆధారంగా 12 మిలియన్‌ టన్నుల కన్నా అధికంగా ఎగుమతి చేయగలమని.. కానీ ప్రస్తుత పరిస్థితుల రిత్యా కేవలం పది మిలియన్‌ టన్నులు మాత్రమే ఎగుమతి చేయబోతున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. వడగాలులు ఉన్నప్పటికీ గతేడాది కన్నా అధిక మొత్తంలో ఎగుమతి చేయగలమని తాము అంచనా వేస్తున్నామని అన్నారు. అయితే వ్యాపారులు మాత్రం దిగుబడిలో పది శాతం తగ్గవచ్చని అంచనావేస్తున్నారు. ఉత్పత్తిలో వంద మిలియన్‌ టన్నుల వరకు పది శాతం తగ్గుతుందని భావిస్తున్నట్లు గ్లోబల్‌ ట్రేడింగ్‌ సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దీంతో ఎగుమతులు కష్టమని అన్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని మార్కెట్లలో ధరలు 15 శాతం పెరిగాయని ముంబయి డీలర్‌ ఒకరు తెలిపారు.

Related Posts