విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ లో మధ్యతరగతి ఆదాయ వర్గాలకు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ స్కీమ్ ను సీఎం గత నెలలో సబ్బవరం పర్యటన సందర్భంగా ప్రారంభిం చారని విశాఖ జిల్లా కలక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాలో మొత్తం 6 లేఔట్లు సిద్ధం చేయడవెైునదన్నారు. విశాఖ జిల్లాలో జి.యస్.అగ్రహారం, పాలవలస, రామవరం లో మొత్తం 4 లేఔట్లుకు గాను 150, 200, 240 చదరపు గజాల విస్తీర్ణం లో 2,311 రెసిడెన్షియల్ ప్లాట్లు సిద్దం చేయ డం జరుగుతుందన్నారు. మధ్య తరగతి ఆదాయ వర్గాలకు అందుబాటు ధరలతో ప్రణాళికా బద్దమైన ఫ్యూచర్ లేఔట్ రూపకల్పన చేశారన్నారు . ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతీ లేఔట్లో 10% ఫ్లాట్ లను రిజర్వు చెయ్యడమే కాకుండా ధరలో 20% రాయితీ ఇవ్వబ డునని, పెన్షనర్ లకు ప్రతి లేఔట్ లో 5 % ప్లాట్లు రిజర్వ చేయబడుతుందన్నారు.కమ్యూనిటి హాల్, పాఠశాలలు, షాపింగ్ స్థలాలు, బ్యాంక్, హెల్త్ సెంటర్, వార్డ్ సచివాలయం, మరియు ఇతర సౌకర్యాలు కల్పిం చి, మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, వీధి దీపాల తో కూడిన నాణ్యమైన సదుపాయలు కూడా కల్పిస్తా మని పేర్కొన్నారు.