YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఆసియా క్రీడలు నిరవధికంగా వాయిదా

ఆసియా క్రీడలు నిరవధికంగా వాయిదా

షాంఘై మే 6
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ఏషియన్‌ గేమ్స్‌ నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆథిత్య దేశమైన చైనా ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఎలాంటి కారణాలు చెప్పనప్పటికీ ఆసియా క్రీడలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే క్రీడలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని వెల్లడించలేదు. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. హాంగ్జూ పట్టణంలో సెప్టెంబర్‌ 10 నుంచి 25 వరకు ఏషియన్‌ గేమ్స్‌ జరగాల్సి ఉన్నాయి. అయితే చైనాలో కరోనాకు కేంద్రంగా ఉన్న షాంఘైకి సమీపంలోనే హాంగ్జూ పట్టణం ఉన్నది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి షాంఘైలో గత కొన్ని వారాలుగా కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. కాగా, ఏషియన్‌ గేమ్స్‌ కోసం హాంగ్జూ సిద్ధంగా ఉన్నదని స్థానిక ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. క్రీడల నిర్వహణకు కొత్తగా 56 స్టేడియాలను నిర్మించామని తెలిపింది. అయితే ఫిబ్రవరిలో ముగిసిన వింటర్‌ ఒలింపిక్స్‌ అనుభవాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసియా క్రీడలను వాయిదా వేస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Related Posts