YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అభివృద్ధి దిశగా ఆర్టీసీ

 అభివృద్ధి దిశగా ఆర్టీసీ

కరీంనగర్‌ రీజనల్‌ పరిధిలోని ఆర్టీసీ డిపోల అభివృద్ధిపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధికి ఉమ్మడి కరీంగనర్‌ జిల్లాకు దాదాపు రూ.10 కోట్ల వరకు నిధులు వచ్చాయి. ఈ నిధులతో చాలా చోట్ల పనులు సైతం ప్రారంభించారు. అయితేకొన్ని చోట్ల పనులు మధ్యలోనే నిలిచి పోయాయి. వీటిపై దృష్టి సారించిన అధికారులు సదరు పనులన్నింటినీ త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం ముందుకెళ్లి అవసరమైతే మిగిలిన పనులకు మళ్లీ రీటెండర్లకు ఆహ్వానించి పనులను త్వరిత గతిన పూర్తి చేయిస్తామని వెల్లడించారు. దీంతో పాటు పట్టణాలలో ప్రధాన కూడలి వద్ద ప్రయాణికుల సౌకర్యం కోసం బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయనున్నారు.  మెట్‌పల్లిలో 4, కోరుట్ల 1, జగిత్యాల 3 బస్స్లు షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి టెండర్లను పూర్తి చేసుకుని అగ్రిమెంట్‌ కూడా జరిగింది. మరో 10 రోజుల్లో పనులను ప్రారంభించనున్నారు. నిబంధనల ప్రకారం అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదిలాఉంటే స్థానికంగా ఆర్టీసీ అభివృద్ధి పథంలోనే ఉంది. అయితే ఇంధనం ధర పెరుగుతుండడంతో ఆర్టీసీపై భారం పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారయంత్రాంగం కృషిచేస్తోంది. ప్రయాణికులకు సమర్ధవంతమైన సేవలు అందించేలా ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలపై అంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Related Posts