అమరావతి మే 6
అనకాపల్లి జిల్లాలో చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత తీవ్రంగా స్పందించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. అనకాపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలో బీ ఫార్మసీ విద్యార్థిని తేజశ్విని ఘటనలపై ఆరా తీశారు. ఉన్నతాధికారులతో ఆమె ఫోన్లో మాట్లాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు.అనకాపల్లి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.
ఏపీలో కొనసాగుతున్న లైంగిక దాడుల పరంపర..... అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలిక అత్యాచారం...
ఏపీలో లైంగిక దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. సభ్యసమాజం తలవంచుకునేలా రోజుకో ఘటన కలకలం రేపుతుంది. మృ(మ)గాళ్లు రెచ్చిపోయి దారుణాలకు ఒడిగట్టుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న రాత్రి అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. అక్కాచెల్లెల్లు బహిర్భూమికి వెళ్లిన సమయంలో పక్కింట్లో ఉండే సాయి అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.మరోబాలిక ఇంటికి వెళ్లి చెల్లెను ఎవరో లాక్కెళ్లరని కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి వెళ్లి చూడగా అప్పడికే జరగరాని దారుణం జరిగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు గుర్తించి చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడి ఆచూకి కోసం పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఏఎస్పీ మణికంఠ తెలిపారు.