నంద్యాల
జిల్లాలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ కర్నూల్ డి ఐ జి కిరణ్ కుమార్ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కి కార్యాలయ సేవల నిమిత్తం వచ్చే ప్రజలకు తప్ప ఇతర అనధికార వ్యక్తుల కు ప్రవేశం లేదని... అలాంటి వారిపై సీసీ కెమెరాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రజలు తమ దస్తావేజు ను తయారు చేసుకుని రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో పిడిఈ పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారా వారి ఆస్తి క్రయ విక్రయ మరియు ఇతర వివరాలు నమోదు చేసుకుని వచ్చినట్లైతే త్వరగా వారి దస్తావేజులు రిజిస్టర్ చేసుకుని వెళ్ల వచ్చని ... కావున దస్తావేజుల రిజిస్ట్రేషన్ కు వచ్చే ప్రజలు ఈ పబ్లిక్ డేటా ఎంట్రీ సౌకర్యం వినియోగించుకోవాలని కోరారు.