గ్యాంగటక్, మే 7,
చట్టం న్యాయం ముందు అందరూ సమానమే.. తన పర బేధం లేకుండా వృత్తిని దైవంగా భావించే డ్యూటీ మైండెడ్ పోలీసు ఆఫీసర్లు ఉన్నారు. అలాంటి మహిళా పోలీసు అధికారిణి ఇప్పుడు అందరితోనూ శభాష్ అనిపించుకుంటుంది. నిజాయతీకి నిలువెత్తు రూపం అంటూ లేడీ సింగమలై అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తనకు కాబోయే భర్త మోసగాడు అని తెలియడంతో.. ఏమాత్రం ఆలోచన చేయకుండా తనకు కాబోయే భర్తను అరెస్ట్ చేసింది. ఈ అరుదైన ఘటన అసోంలో చోటు చేసుకుంది. నాగాన్ జిల్లాలో జున్మోని రభా సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోంది. రభాకు పొగగ్ అనే యువకుడితో గత అక్టోబర్‌లో నిశ్చితార్ధం అయింది. ఈ ఏడాది నవంబర్ లో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కూడా.. రాణా పొగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా మహిళా ఎస్ఐకి పరిచయం చేసుకున్నాడు. అయితే, అతడు ఓ ఘరానా మోసగాడని తర్వాత తేలింది. అయితే తనకు కాబోయే భర్త నేర చరిత్రుడని తెలుసుకున్న తర్వాత.. వెంటనే పొగగ్ ని అరెస్ట్ చేసింది. ఈ ఏడాది నవంబర్ లో వారి పెళ్లి జరగాల్సి ఉందిఈ విషయంపై అస్సాం పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుడు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కి చెందిన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అని తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. పీఎస్‌యూ ఉద్యోగి అనే ముసుగులో ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయాలు వసూలు చేసినట్లు చెప్పారు. చివరకు పొగాగ్ పాపం పండి.. అతడు చెప్పిన అబద్దాలు బయటపడ్డాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్ఐ జున్మోని రభా… కాబోయే భర్త రాణా పొగాగ్ ను అరెస్ట్ చేసింది. పోగాగ్ ఇంటి నుంచి ఓఎన్‌జిసికి చెందిన 11 నకిలీ ముద్రలు , నకిలీ గుర్తింపు కార్డులతో సహా అనేక నేరారోపణ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇదే విషయంపై సబ్-ఇన్‌స్పెక్టర్ రభా స్పందిస్తూ.. తాను ఒక మోసగాడిని అరెస్ట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యానని అని చెబుతున్నారు. అంతేకాదు తాను ఓ మోసగాడి బారినుంచి తప్పించుకున్నందుకు చాలా సంతోషముగా ఉన్నానని తెలిపారు. అతడి నిజ స్వరూపం గురించి సమాచారం ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వేనోళ్ల కృతజ్ఞతలు తెలిపారు. వైవాహిక జీవితంలో తాను మోసపోకుండా కాపాడారని కొనియాడారు. రాణా పోగాగ్ ఎంత మోసగాడో అర్థమైందని వెల్లడించారు.తనకు కాబోయే భర్త అని కూడా చూడకుండా మోసగాడని తెలిసిన వెంటనే అరెస్ట్ చేసిన లేడీ పోలీస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రభాని లేడీ సింగం, లేడీ దబాంగ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.