YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మళ్లీ వారణాసిలో హైడ్రామా

మళ్లీ వారణాసిలో హైడ్రామా

లక్నో, మే 7,
కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం మరింత ముదిరింది. కోర్టు ఆదేశాలతో మసీదులో సర్వే చేపట్టారు అధికారులు. కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్‌ గౌరీ ప్రతిమలపై సర్వే జరపాలని కోర్టు ఆదేశించింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో హైడ్రామా నడుస్తోంది. కాశీ జ్క్షానవాపి మసీదులో కోర్టు ఆదేశాలతో సర్వే జరుగుతోంది. గట్టి భద్రత మధ్య సర్వే చేస్తున్నారు కోర్టు అధికారులు. జ్ఞానవాపి మసీదు లోపల ఎట్టి పరిస్థితుల్లో సర్వేకు, వీడియోగ్రఫీకి అనుమతి లేదంటున్నారు నిర్వాహకులు. సర్వే సిబ్బందిని అడ్డుకోవడానికి వాళ్లు ప్రయత్నంచడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు వారికి నచ్చచెప్పారు. కాశీలోని విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే చేయడం వివాదాస్పదంగా మారింది. స్థానిక కోర్టు ఆదేశాల మేరకు “శృంగార్‌ గౌరీ స్థల్‌” పునాదులపై సర్వేలో భాగంగా జ్ఞానవాపి మసీదులో వీడీయోగ్రఫీ చేస్తున్నారు. అయితే అన్యమతస్తులు మసీదులోకి రాకూడదంటూ స్థానిక ముస్లింలు వ్యతిరేకించారు. ఈ సర్వే మూడు నుంచి నాలుగు రోజులు పడుతుందని చెబుతున్నారు.కోర్టు సర్వే చేయాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని జ్ఞానవాపి మసీదు నిర్వాహకులు చెబుతున్నారు. పరిశీలన కోసమే వెళ్లాలని సూచించినట్టు తెలిపారు. ఏప్రిల్‌ 26వ తేదీన కాశీ విశ్వనాథ్‌-జ్క్షానవాపి మసీదు కాంప్లెక్స్‌లో సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. మసీదు ప్రాంగణం లోని రెండు బేస్‌మెంట్‌ల్లో సర్వే చేయాలని న్యాయమూర్తి సూచించారు.కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్‌ గౌరీ తదితర ప్రతిమలకు పూజలు చేసుకోవడానికి అనుమతించాలని గత ఏడాది నలుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మే 10 లోగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని వారణాసి సెషన్స్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాశీ -జ్ఞానవామి మసీదు వివాదం 1991 నుంచి కోర్టులొ నడుస్తోంది. అలహాబాద్‌ హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది.

Related Posts