విశాఖపట్నం
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా మండి పడ్డారు. విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రికి వైఎస్సా ర్సీపీ కేడర్ ఘన స్వాగతం పలికారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన చూసి ప్రజలు నవ్వుకుంటు న్నారని ఎద్దేవా చేశారు. అధికారం లేదు, ఇక రాదు అని అక్కసుతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీ కొట్టుకు వెళ్తే జై జగన్ అంటూ అక్కడ ఉన్న యువత అనడంతో అక్కడి నుంచి పక్కకు జారుకున్నారని సెటైర్లు పేల్చారు.ఒంటరిగా పోరాటం చేయడానికి చేత కాక పొత్తులపై చంద్రబాబు ఆరాటప డుతున్నారన్నా రు. ప్రజలు అధికారం ఇస్తే చంద్రబాబు ఏం చేశారని.. కొడుకు లోకేష్‌తో కలిసి ఈ రాష్ట్రాన్ని రాబం దుల్లా తిన్నారన్నారు. అన్న క్యాంటీన్లు నుంచి అమరావతి వరకు చిన్న పిల్లల కోడి గుడ్లు దగ్గర్నుంచి ఫైవ్ స్టార్ వంట ల వరకు దోచుకున్నారని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి చంద్రబాబుని క్విట్ చేయాలని..ఆయనది అధికారం కోసం ఆరాటమన్నారు.చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారని.. జగన్‌పై యుద్ధం చేసే ఆయనకు, కొడుకుకు దమ్ము ఉందా అన్నారు. నారా యణ కాలేజ్‌లో పేపర్ లీక్ చేసింది చంద్రబాబు కాదా అంటూ విమర్శించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రు డుకు అక్క అమ్మ, చెల్లి ఎవరూ లేరా అని సూటిగా ప్రశ్నించారు రోజా. అయ్యన్న ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై మాట్లాడితే ఆయనకు బాధగా ఉండదా అన్నారు. తన భర్త సెల్వమణి ఏ రాష్ట్రంలో షూటింగ్‌లు..ఆ రాష్ట్రంలో జరిగితే బాగుంది అని చెప్పారని క్లారిటీ ఇచ్చారు. కానీ తన భర్తపై టీడీపీ పార్టీ నాయకులు వక్రీకరించారని.. ఏ రాష్ట్రంలో షూటింగ్లో జరిగితే ఆ రాష్ట్రానికి డబ్బులు వస్తాయి అని తన భర్త చెప్పడం తప్పా అన్నారు.