YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

36పరాయి పాలకులకు ఎదురొడ్డి నిలిచిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు

  36పరాయి పాలకులకు ఎదురొడ్డి నిలిచిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు

శ్రీశైలంప్రాజెక్ట్  
శ్రీశైలం ప్రాజెక్టు భగత్ సింగ్ కాలనీ లోఐ ఫ్ టి యు ఆధ్వర్యంలో అల్లూరిసీతారామరాజు 98 వ వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం జిల్లా అధ్యక్షుడు వై ఆశీర్వాదం మాట్లాడుతూ ఆదివాసి చెంచు గిరిజన హక్కుల కోసం భూమి బుక్ ఆదివాసి గిరిజనులకు అడవి సంపద కావాలని పోరాడిన ఆరాధ్యుడు బ్రిటీషు పరాయి పాలకులకు ఎదురొడ్డి నిలిచిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులకు వెన్నులో వణుకు పుట్టించిన పోరాట విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు నాగరిక సమాజానికి దూరంగా జీవించే అమాయకపు గిరిజనులు స్వాతంత్ర్యం కోసం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగంచేసి బ్రిటిషర్లకు నిద్రలేకుండా చేసిన అల్లూరి భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోన్నతమైన శక్తి అని ప్రజల హక్కుల కోసం,రెండు సంవత్సరాల పాటు బ్రిటిషన్లకు కంటినిండా నిద్రలేకుండా గడగడలాడించిన వ్యక్తి అల్లూరి. 1924 మే 7వ తేదీన ఆయన మరణించారు.అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మిన వ్యక్తి.దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు ఆయన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్‌ సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నారు.అల్లూరి సీతారామరాజు  సంస్కృతం,విలువిద్య, గుర్రపుస్వారీలో మంచి ప్రావీణ్యం కలిగిన వీరుడు. ఆయన ఆశయానికి అనుగుణంగా ప్రధానంగా ఆదివాసి చెంచు గిరిజనులు తమ హక్కుల కోసం పోరాడాలని అల్లూరి ఆశయాలను కొనసాగించాలని  పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐ ఫ్ టి యు మండల అధ్యక్షుడు కార్యదర్శి వై సీను మల్లికార్జున  గౌడు సత్య రాజు  మద్దిలేటి. కొమరం భీమ్ చెంచు గిరిజన సంక్షేమ సంఘం నాయకులు. కుడుముల వెంకటేశ్వర్లు. పి డి యస్ యు జ్ఞానేశ్వర్ జగ్గు తదితరులు పాల్గొన్నారు.

Related Posts