అమరావతి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం సర్కారువారి పాట చిత్రానికి సంబంధించి టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర పెంచుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సినిమాల విడుదలకు ముందు సదరు సినిమా నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కలిసి తమ బడ్జెట్ను చూపి సినిమా టికెట్ల రేట్ల పెంపునకు అభ్యర్థిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సర్కారువారి పాట సినిమా యూనిట్ కూడా ఏపీ ప్రభుత్వాన్ని టికెట్ల రేట్ల పెంపునకు అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన ఏపీ సర్కారు... సర్కారువారి పాట సినిమా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి మంజూరు చేసింది.