న్యూఢిల్లీ మే 7
ఈ నెల 1న కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచిన ప్రభుత్వం.. ఈసారి గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్‌పై వడ్డించింది. 14 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ దేశీయ ఇంధన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1052కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే రూ.30 కలిపితే రూ.1082 అవుతుంది. పెంచిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరను మార్చి 22న పెంచిన విషయం తెలిసిందే.ఈ నెల 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచిన విషయం తెలిసిందే. 19 కిలోల సిలిండర్‌పై ఒకేసారి రూ.250 వడ్డించాయి. దీంతో సిలిండర్ ధర రూ.2460కు పెరిగింది. వారం రోజుల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.